Pushpa: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్

పుష్ప యూనిట్ ను ఉత్సాహపరిచేలా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Pushpa: పుష్ప టీమ్‌కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్

Pushpa

Pushpa: మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. సుకుమార్ దర్శకత్వంలో.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా పుష్ప. రేపే ఈ సినిమా విడుదల కాబోతోంది. సినిమా యూనిట్.. ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఇలాంటి తరుణంలో.. పుష్ప యూనిట్ ను ఉత్సాహపరిచేలా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

“పుష్ప సినిమా కోసం మీరంతా చాలా కష్టపడ్డారు. మనసు పెట్టి పని చేశారు. మీ ప్రయత్నాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మీరు ఆశించిన ఫలితం దక్కాలని కోరుకుంటున్నా” అంటూ.. అల్లు అర్జున్, రష్మిక మందన్నా, సుకుమార్, మైత్రీ మూవీ మేకర్స్ కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న మూవీ టీమ్ కు.. చిరు విషెస్.. కాస్త ఉత్సాహాన్ని ఇచ్చాయనే చెప్పవచ్చు.

ఇప్పటికే.. హైదరాబాద్ తో పాటు.. తమిళ, కన్నడ ఇండస్ట్రీల్లో ప్రమోషన్స్ చేసిన పుష్ప టీమ్.. తాజాగా బాలీవుడ్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. అక్కడ కూడా బన్నీ ప్రమోషన్స్ చేస్తున్నాడు. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ విజయంపై.. బన్నీతో పాటు.. చిత్ర యూనిట్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఆ విషయాన్ని ప్రమోషన్ ఈవెంట్లలో బలంగా వ్యక్తం చేస్తున్నాడు.. బన్నీ.

షూటింగ్ విశేషాలను పంచుకోవడమే కాక.. తామెంత కష్టపడ్డామన్నది చెబుతూ.. ఐకన్ స్టార్ తో పాటు.. నేషనల్ క్రష్ రష్మిక.. జనాన్ని అట్రాక్ట్ చేసే పనిలో ఉన్నారు. వాళ్లు మాత్రమే కాకుండా.. సినిమాలో విలన్ గా నటించిన కమెడియన్ సునీల్.. ఇప్పటికే మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆర్ట్ డైరెక్టర్ సైతం.. సినిమా గురించిన విశేషాలను మీడియాతో పంచుకున్నారు. సినిమా రిలీజ్ కు ఒక్క రోజు ముందు కూడా.. ప్రమోషన్స్ జోరును ఫుల్ స్వింగ్ తో కంటిన్యూ చేస్తున్నారు.

ఇవన్నీ చూస్తున్న జనాలు.. అంచనాలు పెంచేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలు కూడా.. పుష్ప విజయంపై విశ్వాసంతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కూడా.. ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Read More:

Pushpa: మాసివ్ సీక్రెట్స్ రివీల్.. ఇన్ని కష్టాలు పడ్డారా?

Pushpa : గతంలో ఎడమ భుజానికి సర్జరీలు.. పుష్పలో భుజం పైకి పెట్టుకుని నటించడంతో..

Pushpa: సౌత్ టు నార్త్ తగ్గేదేలే.. హీటెక్కిస్తోన్న పుష్ప ఫీవర్

Pushpa: బన్నీ మేనియా.. ఐకాన్ స్టార్‌పై టాలీవుడ్ ప్రశంసల వర్షం!

Pushpa: బన్నీపై దేవిశ్రీ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. కల సాకారమయ్యేనా?

Pushpa: 4 సినిమాల కష్టం పుష్ప.. తగ్గేదే లే.. 17న వస్తున్నా..!

Pushpa-1: రాసిపెట్టుకోండి పుష్ప బ్లాక్ బస్టర్.. మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్!

Pushpa-Samantha : సమంత ఐటమ్ సాంగ్ పాడిన మంగ్లీ చెల్లెలు.. ఆమె గురించి తెలుసా..?

pushpa : పుష్ప హిందీ వర్షన్‌లో అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పింది ఇతనే

Pushpa : పుష్ప ప్రమోషన్స్ చేస్తున్న డేవిడ్ వార్నర్.. తగ్గేదేలే అంటున్న బన్నీ