Pushpa: సౌత్ టు నార్త్ తగ్గేదేలే.. హీటెక్కిస్తోన్న పుష్ప ఫీవర్

సౌత్ టు నార్త్ ఆడియెన్స్ కిప్పుడు పుష్ప ఫీవర్ పట్టుకుంది. ఈ శుక్రవారమే ల్యాండ్ కాబోతున్న పుష్పరాజ్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు బాహుబలి రేంజ్ లో..

Pushpa: సౌత్ టు నార్త్ తగ్గేదేలే.. హీటెక్కిస్తోన్న పుష్ప ఫీవర్

Pushpa

Pushpa: సౌత్ టు నార్త్ ఆడియెన్స్ కిప్పుడు పుష్ప ఫీవర్ పట్టుకుంది. ఈ శుక్రవారమే ల్యాండ్ కాబోతున్న పుష్పరాజ్ కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. దీనికి తోడు బాహుబలి రేంజ్ లో మార్కెటింగ్ చేస్తోన్న పుష్ప డీల్స్ ఫ్యాన్స్ ని నిద్రపోనివ్వట్లేదు. రాజమాళి లాంటి ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఎక్స్ పర్టే.. నేషనల్ వైడ్ పుష్పరాజ్ కున్న దమ్ము గురించి చెప్తుంటే తగ్గేదేలే అనకుండా అభిమానులు ఎలా ఉంటారు.

Ankita Lokhande-Vicky Jain: బీటౌన్‌లో పెళ్లిళ్ల సీజన్.. పెళ్లి పీటలెక్కుతున్న హాట్ కపుల్స్!

నేషనల్ వైడ్ పుష్ప క్రేజ్ చూస్తుంటే నెవర్ బిఫోర్ రేంజ్ కనిపిస్తోంది. తగ్గేదే లే అన్నట్టు నిజంగానే పుష్పరాజ్ ఫీవర్ సౌత్ టు నార్త్ ఆడియెన్స్ ను పట్టేసింది. శుక్రవారం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారంటే అది నిజం. తెలుగులో బన్నీ మాస్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అటు కేరళ ఇండస్ట్రీలోనూ మల్లు అర్జున్ అంటే జై కొట్టే అభిమానులు పుష్కలంగా ఉన్నారు. ఇప్పుడు చూస్తుంటే తమిళనాడులోనూ ఐకాన్ స్టార్ సృష్టిస్తోన్న ప్రభజంనం అంచనాలకందట్లేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో అదీ బాలీవుడ్ లో సైతం పుష్ప మార్కెట్ బాహుబలిని క్రాస్ చేసేలా దూసుకుపోతుంది.

Shyam Singha Roy Trailer: హ్యూమన్ కాన్షెష్‌నెస్.. సింగరాయ్‌లా మారిన వాసు!

రాజమౌళి చెప్పినట్టు హిందీ ఆడియెన్స్ పుష్పరాజ్ కోసం ఫుల్ క్రేజ్ చూపిస్తున్నారు. అక్కడి క్రిటిక్స్ సైతం పుష్పపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. నిజానికి తెలుగు డబ్బింగ్ సినిమాలతో అల్లు అర్జున్ తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాలీవుడ్ లో సెట్ చేసుకున్నారు. ఇప్పుడేకంగా పుష్పలాంటి ప్యాన్ ఇండియా సినిమాతో థియేటర్స్ కొస్తుంటే.. అక్కడి జనాలు రారమ్మని వెల్కమ్ చెప్తున్నారు. పెద్ద హడవిడీ చేయకుండా సైలెంట్ గా కనిపించే బన్నీకి ఉన్న ఇలాంటి సూపర్ నేషనల్ క్రేజ్ చూసి ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఐకాన్ స్టార్ టాలీవుడ్ టాప్ స్టార్ గా మారాడనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor: అందాల నెరజాణ.. అదరహో అనిపిస్తున్న జాన్వీ!

అందరినీ అలరించేలా ఐకానిక్ స్టోరీతో పాటూ పవర్ఫుల్ యాక్టర్స్ ను పుష్పలో సెట్ చేసారు సుకుమార్. హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మికా, ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా సమంతాను తీసుకొచ్చారు. ఫహాద్ ఫాజిల్ లాంటి నేషనల్ అవార్డ్ విన్నర్ విలన్ గా భయపెట్టబోతున్నాడు. ఇక దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ చేసే మ్యాజిక్ తెలిసిందే. ఇలా బన్నీకి తగ్గ రేంజ్ లో నేషనల్ కాస్ట్ ఉండటంతో ఆటోమెటిక్ గా అంచనాలు పెరిగాయి. అందుకే యూఎస్ లో సైతం కేవలం ప్రీబుకింగ్ లోనే 2 లక్షల డాలర్ల కలెక్షన్స్ ను రాబట్టింది. అదీ అతి తక్కువ టైంలో. ఇలా ఇండియా, ఫారెన్ అనే తేడా లేకుండా పుష్ప అడ్వాన్స్ బుకింగ్ స్పీడ్.. నెవర్ బిఫోర్ ఎక్సీపిరియెన్స్ ను ఇస్తోంది. ఇక సెన్సార్ సర్టిఫికేట్ చూపిస్తున్నట్టు 2 గంటల 59 నిమిషాల విజువల్ వండర్ పుష్ప రావడమే లేట్ మరి.

Oo Antava Song-Ariyana Dance: సామ్ ఐటెం సాంగ్‌కి బిగ్‌బాస్ బ్యూటీ డాన్స్!