Shyam Singha Roy Trailer: హ్యూమన్ కాన్షష్‌నెస్.. శ్యామ్ సింగరాయ్‌లా మారిన వాసు!

నేచురల్ స్టార్ నానీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో..

Shyam Singha Roy Trailer: హ్యూమన్ కాన్షష్‌నెస్.. శ్యామ్ సింగరాయ్‌లా మారిన వాసు!

Shyam Singha Roy Trailer

Shyam Singha Roy Trailer: నేచురల్ స్టార్ నానీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. ఈ సినిమా సౌత్ లోని అన్ని భాషల్లో విడుదల చేయనున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి, కృతి‌శెట్టి, మడోనా సెబాస్టియన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది.

Janhvi Kapoor: అందాల నెరజాణ.. అదరహో అనిపిస్తున్న జాన్వీ!

ఈ నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ మూవీ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది మూవీ యూనిట్. తాజాగా, ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అనుకున్నట్లుగానే నానీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. వాసు పాత్రలో దర్శకుడు కావాలని కలలు కంటూ ఉద్యోగాన్ని వదిలేసి ఆ ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే.. తనలో శ్యామ్ సింగరాయ్ కనిపిస్తుంటాడు. శ్యామ్ సింగరాయ్ పాత్రలో నానీ పవర్ ఫుల్ పాత్రను పరిచయం చేయగా సాయిపల్లవి దేవదాసి పాత్రలో కనిపిస్తుందని అర్ధమవుతుంది.

Chiru 155: మెగా దూకుడు.. మరో సినిమా ప్రకటించేశారు!

ఇదే ట్రైలర్ లో నానీ-కృతిశెట్టిల రొమాన్స్ జస్ట్ అలా మెరిపించారు మేకర్స్. ఇన్నాళ్లు నానీ ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉన్నాడు. అలాగే కృతి శెట్టి కూడా రొమాన్స్ కు హద్దులు పెడుతుందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ.. ట్రైలర్ లో చూపించిన రొమాన్స్ ను బట్టి ఈ సినిమాతో నానీ-కృతిల హద్దులు చెరిగిపోయినట్లే అనుకోవచ్చు. నాని కెరీర్ లోనే క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి!