Pushpa: మాసివ్ సీక్రెట్స్ రివీల్.. ఇన్ని కష్టాలు పడ్డారా?

ఎప్పుడెప్పుడా అని నిమిషాలు లెక్కపెట్టుకుంటోన్న ఫ్యాన్స్ ను మరింత ఎక్జైట్ చేస్తున్నారు పుష్ప స్టార్స్. ఈ మూవీకి సంబంధించి మాసివ్ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారు. మేకప్ దగ్గరి నుంచి..

Pushpa: మాసివ్ సీక్రెట్స్ రివీల్.. ఇన్ని కష్టాలు పడ్డారా?

Pushpa

Pushpa: ఎప్పుడెప్పుడా అని నిమిషాలు లెక్కపెట్టుకుంటోన్న ఫ్యాన్స్ ను మరింత ఎక్జైట్ చేస్తున్నారు పుష్ప స్టార్స్. ఈ మూవీకి సంబంధించి మాసివ్ సీక్రెట్స్ రివీల్ చేస్తున్నారు. మేకప్ దగ్గరి నుంచి టిపికల్ షాట్స్ షూటింగ్ వరకు.. టీమ్ పడ్డ కష్టం వింటుంటే ఎంత గ్రాండ్ గా రియలిస్టిక్ టచ్ తో పుష్పరాజ్ రాబోతున్నాడో అర్ధమవుతోంది. పుష్ప ప్రమోషన్స్ ను భుజాన వేసుకుని ఒక్కడే నడిపిస్తున్నారు అల్లు అర్జున్. యూఎస్ ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే ఫిక్స్ కావడంతో కంటెంట్ అందించడానికి అటు సుకుమార్ టీమ్ కష్టపడుతోంది. ఇటు ఐకాన్ స్టార్ రష్మికతో కలిసి ప్రమోషనల్ షో రన్ చేస్తున్నారు.

Balakrishna: సై అంటే సై అంటున్న నందమూరి నటసింహం!

హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత చెన్నైలో ప్రెస్ మీట్ ఫినిష్ చేసిన బన్నీ.. బెంగళూర్, కొచ్చి, ముంబయి సిటీస్ ను కవర్ చేసే పనిలో ఉన్నారు. ఈ స్పెషల్ మీట్స్ లోనే పుష్పకు సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ను రివీల్ చేస్తున్నారు. నెవర్ బిఫోర్ రేంజ్ లో పుష్ప కోసం మేకోవర్ అయ్యారు అల్లు అర్జున్. గంధపు చెక్కల స్మగ్లర్ గా పూర్తిగా రా లుక్ లో కనిపించడం కోసం రెండున్నర గంటల పాటూ స్పెషల్ మేకప్ వేసుకున్నారు. హెయిర్ స్టైల్ దగ్గరి నుంచి వాడిన బట్టలు, వస్తువుల వరకు గ్రే షేడ్స్ ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు పడ్డారు.

S.V.Krishna Reddy: ఒకప్పటి ట్రెండ్ సెట్టర్ దర్శకుడు.. ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ!

చిత్తూరు స్లాంగ్ కోసం కసరత్తులు చేశారు. ఈ సినిమా కోసం మారేడుమిల్లి, చిత్తూరు అడవుల్లో ఎక్కువ సమయం గడిపిన బన్నీ… ఎలాంటి డెడికేషన్ చూపించారో ట్రైలర్, టీజర్స్ చూస్తే అర్ధమైపోతుంది. అలాగే హీరోయిన్ రష్మికతో పాటూ మిగిలిన కాస్ట్ కూడా తమ క్యారెక్టర్స్ కోసం లుక్ ఛేంజ్ చేసిన వాళ్లే. పుష్ప ఒక్క పార్ట్… నాలుగు సినిమాల కష్టంగా చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. నిజానికి తెర మీద ఆ కష్టం కనిపిస్తూనే ఉంది.

Vaani Kapoor: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్ సోయగం వాణీ కపూర్!

పాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ చేయాలనే థీమ్ ఒకవైపు… తీసుకున్న సబ్జెక్ట్ కు 100 పర్సెంట్ న్యాయం చేయాలనే సుకుమార్ ఎఫర్ట్స్ కలిసి పుష్పను టాప్ లెవెల్ లో కూర్చోబెట్టింది. అందుకే పుష్ప కోసం పడ్డ కష్టంతో ఈజీగా నాలుగు సినిమాలు పూర్తి చేయొచ్చనే ఫీల్ టీమ్ లో కనిపిస్తోంది. రష్మిక కూడా ఆమధ్య ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది. ఏదేమైనా తీసుకున్న ఎఫర్ట్స్ కి తగ్గట్టు.. మ్యాసివ్ హిట్ దక్కడం ఖాయంలా కనిపిస్తోంది.