Balakrishna: సై అంటే సై అంటున్న నందమూరి నటసింహం!

ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి అందగాడు. ఫస్ట్ నుంచి ఎనర్జీ లెవెల్స్ హైలో మెయింటైన్ చేసే బాలయ్య.. ఇప్పుడు డోస్ డబుల్ చేశాడు. అఖండ తీసుకొచ్చిన నెవర్ బిఫోర్ సక్సస్ తో ఢీ అంటే ఢీ..

Balakrishna: సై అంటే సై అంటున్న నందమూరి నటసింహం!

Balakrishna

Balakrishna: ఫుల్ జోష్ మీదున్నాడు నందమూరి అందగాడు. ఫస్ట్ నుంచి ఎనర్జీ లెవెల్స్ హైలో మెయింటైన్ చేసే బాలయ్య.. ఇప్పుడు డోస్ డబుల్ చేశాడు. అఖండ తీసుకొచ్చిన నెవర్ బిఫోర్ సక్సస్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఎగిరి గంతులేస్తున్నాడు… ఈజీగా స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. ఇప్పుడలాగే మనసులో మాట బయటపెట్టి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నాడు. ఏదేమైనా ఇప్పుడు బాలకృష్ణ డిఫరెంట్ గా ఆలోచిస్తున్నాడు.. జోరు చూపిస్తున్నాడు. కుర్ర హీరోలకంటే ఎక్కువ హుషారుతో చంటి పిల్లాడిలా ఎగిరి గంతులేస్తున్నాడు. అఖండ సక్సెస్ జోష్ తో పాటు అన్ స్టాపబుల్ అంటూ హడావిడి చేస్తున్నాడు బాలయ్య.

Vaani Kapoor: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్ సోయగం వాణీ కపూర్!

మల్టీస్టారర్ కు నేను రెడీ అన్నారు బాలకృష్ణ. అఖండ సక్సెస్ తో దేవాలయాలను సందర్శిస్తున్న బాలయ్య.. రీసెంట్ గా మల్టీస్టారర్ స్టేట్ మెంట్ పాస్ చేశారు. తనతో చేయడానికి మరో హీరోకి కూడా ధైర్యం ఉంటే మల్టీస్టారర్ మూవీస్ చేస్తానన్నారు. మంచి కథ సెట్ చేయండంటూ మేకర్స్ కి సూపర్ హింట్ ఇచ్చారు. ఆ మధ్య నాని గెస్ట్ గా వచ్చిన అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో సైతం మల్టీస్టారర్ పై పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ట్రెండ్ సెట్ చేయాలనుకునే మైండ్ సెట్ నుంచి ట్రెండ్ ని ఫాలో అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నారు సీనియర్స్. అందుకే ఇప్పుడు బాలయ్య సైతం చిరూ, నాగ్, వెంకీ బాటలోనే ఛాన్స్ వస్తే మల్టీస్టారర్ చేసేందుకు సై అన్నారు. ఇక నటసింహం ఒక అడుగు ముందుకేసి విలన్ గా కూడా నటిస్తానన్నారు అన్ స్టాపబుల్ షోలో. అయితే ఆ మూవీలో హీరో కూడా తనే కావాలంటూ ఫన్ క్రియేట్ చేసారు.

Brahmāstra: ఎట్టకేలకు నాగ్-రణబీర్ సినిమా విడుదల వచ్చేసింది!

మొత్తంగా పైసా వసూల్ తరువాత వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడ్డ బాలయ్యకు.. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. హుషారు వచ్చేసింది. ఇటు అన్ స్టాపబుల్ లో స్టార్ గెస్ట్ లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే.. అటు వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కించేస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కింది. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లతో సినిమాలు లైనప్ పెట్టారు. ఈ సరి కొత్త ఎగ్జైట్ మెంట్ తోనే మంచి స్టోరీ తీసుకొస్తే.. మల్టీస్టారర్ కి సైతం రెడీ అంటున్నాడు. మరి ఎవరైనా ధైర్యం చేస్తారా అన్నది చూడాలి.