Pushpa-Samantha : సమంత ఐటమ్ సాంగ్ పాడిన మంగ్లీ చెల్లెలు.. ఆమె గురించి తెలుసా..?

సమంత ఐటమ్ పాట రిలీజ్ కు 2 గంటల ముందే... లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఇచ్చారు మేకర్స్. ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్ అని ప్రకటించారు.

Pushpa-Samantha : సమంత ఐటమ్ సాంగ్ పాడిన మంగ్లీ చెల్లెలు.. ఆమె గురించి తెలుసా..?

Samantha Item Song Indravathi Mangli Sister Singer

Updated On : December 10, 2021 / 5:17 PM IST

Pushpa-Samantha : అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో విడుదలకు సిద్ధమైన మూవీ పుష్ప – ద రైజ్ 01. ఈ మూవీ డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కాబోతోంది. మూవీ ప్రమోషన్ ను పీక్స్ కు తీసుకెళ్తున్నారు మేకర్స్. స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటమ్ సాంగ్ లిరికల్ సాంగ్ ను ఈ సాయంత్రం 7గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు.

Read This : Pushpa : ‘పుష్ప’ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మరో రెండు రోజుల్లో..

పుష్ప మూవీకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికే మార్మోగుతోంది. దేవిశ్రీ స్వరపరిచే ఐటమ్ గీతాలకు తెలుగు నాట, దక్షిణాదిన ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటూ వస్తోంది. అలాంటిది… ఓ స్టార్ హీరోయిన్ సమంత చేసిన తొలి ఐటమ్ సాంగ్ ను.. తన ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ కోసం దేవిశ్రీ ఎలా స్వరపరిచారన్నది పుష్ప ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ మనసులను తొలిచేస్తోంది.

Read This : Samantha : చైతూతో విడిపోయిన తర్వాత చనిపోతా అనుకున్నాను : సమంత

సమంత ఐటమ్ పాట రిలీజ్ కు 2 గంటల ముందే… లేటెస్ట్ అప్ డేట్ ఒకటి ఇచ్చారు మేకర్స్. ఈ పాట పాడింది ఇంద్రావతి చౌహాన్ అని ప్రకటించారు. ఈమె ఎవరంటే.. ప్రముఖ ఫోక్ సింగర్, సినీ నేపథ్య గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి చెల్లెలు. ఈమె కూడా జానపద పాటలు పాడి గుర్తింపు తెచ్చుకున్నారు. కోటి న్యాయ నిర్ణేతగా ‘బోల్ బేబీ బోల్’ రియాలిటీ షోలో కూడా పాడారు.

జార్జిరెడ్డి సినిమాలో ఇంద్రావతి ఓ పాట కూడా పాడారు. ఇపుడు ఈ వాయిస్ ను.. తనదైన ఫోక్, మాస్ ట్యూన్ కు ఉపయోగించారు దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట ఎలా ఉంటుందోనన్న ఆసక్తి.. చైతన్యతో విడిపోయాక సమంత తెరపై ఎలా కనిపించబోతోంది.. అందాలతో ఎలా కనువిందు చేస్తుంది అనే ఉత్కంఠ, క్రేజ్ క్షణ క్షణానికి పెరిగిపోతోంది.