Ashika Ranganath – Sai Pallavi : మొన్న సాయి పల్లవి.. ఇప్పుడు ఆషికా.. సిస్టర్స్ పెళ్లి చేసే పని పెట్టుకున్న హీరోయిన్స్..

ఆషికా రంగనాథ్ అండ్ సాయి పల్లవి తమ సిస్టర్స్ పెళ్లి చేసే బాధ్యతని తీసుకున్నారు. మొన్న పల్లవి.. ఇప్పుడు ఆషికా..

Ashika Ranganath Sai Pallavi take their sister marriage responsibilities

Ashika Ranganath – Sai Pallavi : ఆషికా రంగనాథ్ అండ్ సాయి పల్లవి.. ప్రస్తుతం తమ సిస్టర్స్ పెళ్లి చేసే బాధ్యతని తీసుకున్నారు. ఒకపక్క వీరిద్దరూ వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ ప్రొఫిషినల్ గా బిజీ అవుతూ.. తమ సిస్టర్స్ ని పర్సనల్ లైఫ్ లో బిజీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఒకరి తరువాత ఒకరు తమ సిస్టర్స్ ని పెళ్లి పీటలు ఎక్కించేందుకు రెడీ అయ్యారు.

రీసెంట్ గా సాయి పల్లవి తన చెల్లెలు ‘పూజ కన్నన్’ నిశ్చితార్థం వేడుకని ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. జనవరి 21న ఆదివారం నాడు పూజ కన్నన్ ఎంగేజ్మెంట్ జరిగింది. తాను ప్రేమించిన వ్యక్తిని పూజ పెళ్లి చేసుకోబోతుంది. త్వరలోనే పెళ్లి తేదీని అనౌన్స్ చేయనున్నారు. ఇక ఆ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను సాయి పల్లవి, పూజ కన్నన్ తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వస్తున్నారు.

Also read : Shobha Shetty : పెళ్లి తాంబూలాలు వీడియో షేర్ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ శోభాశెట్టి..

ఇక తాజాగా మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ తన సిస్టర్ ని ఏకంగా పెళ్లి పీటలు వరకు తీసుకు వెళ్లిపోయారు. ఆషికా సిస్టర్ అనూష పెళ్లి వేడుక.. జనవరి 22న సోమవారం నాడు ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆషికా.. ఇప్పుడు అభిమానులతో పంచుకున్నారు. ఇక సిస్టర్ మ్యారేజ్ లో ఆషికా కూడా పెళ్లికూతురులా రెడీ అయ్యారు. పింక్ కలర్ హాఫ్ శారీలో మెస్మరైజింగ్ లుక్స్ ఆకట్టుకుంటున్నారు. మరి ఆ ఫోటోలు వైపు కూడా ఓ లుక్ వేసేయండి.