Ashish New Movie : దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ మూడో సినిమా ఓపెనింగ్.. ఆశిష్ కోసం స్టార్ టెక్నికల్ టీం..

 టాలీవుడ్(Tollywood) స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆశిష్ కోసం ఈ సారి మరింత గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు.

Ashish New Movie : దిల్ రాజు ఫ్యామిలీ హీరో ఆశిష్ మూడో సినిమా ఓపెనింగ్.. ఆశిష్ కోసం స్టార్ టెక్నికల్ టీం..

Ashish Third Movie under DilRaju Productions with Star Technical Team

Updated On : August 21, 2023 / 11:40 AM IST

Ashish New Movie :  టాలీవుడ్(Tollywood) స్టార్ నిర్మాత దిల్ రాజు(Dil Raju) సోదరుడు నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమా రౌడీ బాయ్స్(Rowdy Boys) తో పర్వాలేదనిపించాడు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. మొదటి సినిమాకే అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ని హీరోయిన్ గా పెట్టి లిప్ లాక్, రొమాన్స్ సీన్స్ కూడా పెట్టారు. ప్రస్తుతం రెండో సినిమా సెల్ఫిష్(Selfish) చిత్రీకరణలో ఉంది. రెండో సినిమాలో తమిళ్ లవ్ టుడే ఫేమ్ ఇవానా(Ivana)ని తీసుకున్నారు. తాజాగా మూడో సినిమా ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది.

ఆశిష్ కోసం ఈ సారి మరింత గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు కూతురు, అల్లుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఆస్కార్ గ్రహీత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ PC శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా అవినాష్ కొల్ల వర్క్ చేస్తున్నారు. తాజాగా ఆశిష్ మూడో సినిమా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ అయింది.

Salman Khan : సల్మాన్ ఖాన్ కొత్త లుక్ చూశారా? గుండు బాస్.. షారుఖ్ లాగే సినిమా కోసమో?

ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. త్రివిక్రమ్(Trivikram) ఆశిష్ పై ఫస్ట్ క్లాప్ కొట్టారు. ఈ సినిమాని అరుణ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. మరి మూడో సినిమాలో ఏ హీరోయిన్ ని తీసుకువస్తారో చూడాలి.