Ashok Galla new glimpse out mahesh babu wishes
Ashok Galla : గత ఏడాది ‘హీరో’ (Hero) సినిమాతో టాలీవుడ్ కి పరిచమైన హీరో అశోక్ గల్లా (Ashok Galla). మహేష్ బాబు (Mahesh Babu) కుటుంబం నుంచి వచ్చిన ఈ హీరో మొదటి సినిమాతో డీసెంట్ హిట్టునే అందుకున్నాడు. ఇటీవలే తన రెండో మూవీని అనౌన్స్ చేసి గ్రాండ్ గా లాంచ్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. నేడు (ఏప్రిల్ 5) అశోక్ పుట్టిన రోజు కావడంతో చిత్ర యూనిట్ ఒక చిన్న వీడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. మొదటి సినిమాలో సిటీ బాయ్ లా కనిపిస్తే, ఈ మూవీలో విలేజ్ బాయ్ లా కనిపించబోతున్నాడు.
Mahesh Babu : సొంత రెస్టారెంట్ లో ఫస్ట్ టైం ఫ్యామిలీతో కలిసి తినడానికి వచ్చిన మహేష్
ఈ గ్లింప్స్ లో ఫైట్ సీన్ చూపించారు. ఆ సీన్ చూస్తుంటే పల్లెటూరులో ఆడే చెడుగుడు ఆటలా కనిపిస్తుంది. ఇక పల్లెటూరి గెటప్ కి తగ్గట్టుగా మీసం, ఉంగరాలు జుట్టుతో మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక గ్లింప్స్ ని షేర్ చేస్తూ మహేష్ బాబు, అశోక్ కి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. అలాగే గ్లింప్స్ ఇంటరెస్టింగ్ గా ఉంది అంటూ కామెంట్ చేశాడు. కాగా ఈ సినిమాని అర్జున్ జంధ్యాల డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు కత్తికేయతో ‘గుణ 369’ సినిమాని తెరకెక్కించాడు. కమర్షియల్ సినిమాగా వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
Mahesh Babu: ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్‌ను రెడీ చేస్తోన్న మహేష్..?
ఇక ఈ సినిమాకి టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథని అందిస్తున్నాడు. ఇటీవల హనుమాన్ సినిమా టీజర్ తో అందర్నీ ఆకట్టుకున్న ప్రశాంత్ స్టోరీ అందించడంతో ఈ మూవీ పై హైప్ క్రియేట్ అయ్యింది. శ్రీ లలితాంబ ప్రొడక్షన్స్ పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా తెలియజేయలేదు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
Happy birthday @AshokGalla_! The teaser looks just impressive! All the best for your film & the year ahead!! ?https://t.co/E0jE2G8mnY
— Mahesh Babu (@urstrulyMahesh) April 5, 2023