Ashtadigbandhanam Trailer : అష్టదిగ్బంధనం ట్రైలర్.. అహంతో మొదలైన యుద్ధం.. ఎప్పుడూ బలినే కోరుకుంటుంది
సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం అష్టదిగ్బంధనం. ఎ గేమ్ విత్ క్రైమ్ అనేది ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- September 12, 2023 / 09:25 PM IST
Ashtadigbandhanam Trailer
Ashtadigbandhanam : సూర్య భరత్ చంద్ర, విషిక కోట హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అష్టదిగ్బంధనం'(Ashtadigbandhanam). ‘ఎ గేమ్ విత్ క్రైమ్’ అనేది ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాబా పి.ఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. గతంలో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేయగా తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సాయి రాజేశ్ మాట్లాడుతూ.. టైటిల్ బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.
Maya Petika : ఆహాలో ‘మాయా పేటిక’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
యుద్ధం ఎప్పుడూ బలినే కోరుకుంటుంది. ఈ యుద్ధం రాజ్యం కోసమో, రాణి కోసమో, అధికారం కోసమో కాదు అహం కోసం అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ మొత్తం అనేక హింసాత్మక సీన్స్ తో పాటు, కొన్ని రొమాంటిక్ షాట్స్ కూడా కనిపించాయి. సినిమా మొత్తం అహంతో మొదలైన యుద్ధం, ఆ అహం దేహాన్ని వీడినప్పుడే ముగుస్తుంది అనే లైన్ మీదే సాగుతున్నట్టు క్లారిటీ వచ్చింది. ఇక ట్రైలర్ లో మళయాలం బ్లాక్ బస్టర్ ” ట్రాన్స్ ” సినిమాకి సంగీతం అందించిన ” జాక్సన్ విజయన్ ” బీజీఎమ్ హైలైట్ గా ఉంది. విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
The Expendables 4 : సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఎక్స్‌పెండబుల్స్-4 విడుదల తేదీ..
