Shivam Bhaje First Cut
Shivam Bhaje First Cut : యాంకర్ ఓంకార్ తమ్ముడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. రాజుగారి గది, హిడింబ వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘శివం భజే’. అప్సర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గంగా ఎంటర్టైన్మంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు ఆకట్టుకున్నాయి.
ఇక ఇప్పుడు.. శివం భజే ఫస్ట్ కట్ అంటూ ఓ టీజర్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో ఆరంభంలో అశ్విన్ బాబు కలలో ఏవేవో కనబడుతున్నట్లుగా చూపించారు. తనకు తలనొప్పి వస్తోంది. ఏం జరుగుతోందో అర్థం కావడం లేదంటూ డాక్టర్ వద్ద అశ్విన్ బాబు చెబుతాడు. ‘అలజడి దాటి ఆలోచనలకు పదును పెడితే అంతా అర్థం అవుతుంది శేఖరా..’ ‘ఈ యుద్ధం నీది కాదు.. స్వయంగా నీలకంఠుడు లిఖించిన శత్రు వినాశనం.’ అంటూ అఘోర చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి.
మొత్తంగా ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచుతోంది.