అంబ థియేటర్ హౌస్‌ఫుల్..

లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను అంబ థియేటర్ ఆవరణలో ఉంచారు పోలీసులు..

అంబ థియేటర్ హౌస్‌ఫుల్..

Updated On : June 21, 2021 / 11:01 AM IST

లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను అంబ థియేటర్ ఆవరణలో ఉంచారు పోలీసులు..

హైదరాబాద్ మెహిదీపట్నం అంబ థియేటర్ హౌస్‌ఫుల్ అయింది. వెహికల్ పార్కింగ్ ఫుల్, టికెట్ కౌంటర్లో జనాలు ఫుల్.. పెద్ద హీరో సినిమా రిలీజ్ రోజు ఎలాంటి హంగామా కనిపిస్తుందో అలాంటి సందడే కనిపిస్తోందిప్పుడక్కడ. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతుండగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేసారబ్బా?.. అనుకుంటున్నారా..

మరేంలేదు.. లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో నిబంధనలు ఉల్లంఘించి రోడ్డెక్కిన వాహనాలను ఆసిఫ్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకుని, అంబ థియేటర్ పార్కింగ్ ప్లేసులో ఉంచారు. చలానా చెల్లించి వాహనాలు తీసుకెళ్లాలని చెప్పగా వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు.

Read Also : నటుడి కూతురు ఇంట్లో పనిమనిషికి కరోనా.. దెబ్బకి ఇంట్లో అందరూ!..

చలానా చెల్లించి వెహికల్స్ తీసుకునేవారికి రశీదులు ఇవ్వడానికి గానూ టికెట్ కౌంటర్‌ను ఉపయోగిస్తున్నారు. ఏదేమైనా మన భాగ్యనగర పోలీసుల ఐడియా భలే ఉంది కదూ. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసినా జనాలు థియేటర్లకు రావడానికి మరింత సమయం పట్టే అవకాశం లేకపోలేదంటున్నారు సినీ విశ్లేషకులు.