Avatar 3
Avatar 3 : హాలీవుడ్ ఫేమస్ ఫిలిం సిరీస్ అవతార్ నుంచి మూడో సినిమా రాబోతుంది. అవతార్, అవతార్ 2 సినిమాలతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాడు. ఇండియాలో కూడా అవతార్ సినిమాలకు మంచి మార్కెట్, ఫాలోయింగ్ ఉంది. అవతార్ 2 సినిమా 2022 లో రిలీజయింది.(Avatar 3)
పండోరా గ్రహంతో మొదటి పార్ట్ ఉంటే, అక్కడ్నుంచి సెకండ్ పార్ట్ లో నీళ్ల ప్రపంచంలోకి పండోరా జాతి వెళ్లడం, వాటర్ లో యుద్ధాలతో సెకండ్ పార్ట్ సాగింది. ఇపుడు మూడో పార్ట్ పండోరా జాతి అగ్నికి సంబంధించిన జాతి వద్దకు వెళ్లినట్టు, వాళ్ళతో ఫైట్స్, మాములు మనుషులు వీళ్ళ దగ్గరికి వచ్చి ఫైట్స్ చేస్తున్నట్టు ఉండబోతుంది. అవతార్ 3 సినిమా డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. తాజాగా అవతార్ 3 – ఫైర్ & యాష్ ట్రైలర్ రిలీజ్ చేసారు.
Also Read : Aadya : OG హుడీతో పవన్ కూతురు.. నాన్న సినిమా కోసం అంటూ.. స్పెషల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్..
ఇండియాలో కూడా ఈ సినిమా భారీగా రిలీజ్ అవుతుండటంతో ఇక్కడ లోకల్ భాషల్లో కూడా అవతార్ 3 ట్రైలర్ రిలీజ్ చేసారు. అవతార్ 3 తెలుగు ట్రైలర్ చూసేయండి..