Avengers Endgame: Encore : ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ మళ్ళీ థియటర్స్ లోకి వచ్చేస్తుంది..
తాజాగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. (Avengers Endgame: Encore)
Avengers Endgame: Encore
Avengers Endgame: Encore : మార్వెల్ స్టూడియోస్ మరోసారి బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు సిద్ధమైంది. 2019 లో వచ్చిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు దానికి మరికొన్ని సీన్స్ జతచేసి ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్నారు. ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్: ఎంకోర్’ పేరిట సెప్టెంబర్ 25, 2026న భారతదేశంలో కూడా రిలీజ్ కానుంది.
ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఇండియాలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అలాగే ఐమాక్స్ తో పాటు మార్వల్ స్టూడియోస్ ప్రెసెంత్స్ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫైడ్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్స్‌లోనూ ఈ రీ రిలీజ్ అందుబాటులోకి రానుంది. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో మహత్తర ముగింపుగా నిలిచిన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ను మరోసారి థియేటర్లలో చూసే అవకాశం అభిమానులకు లభించనుంది.
Also See : Nivetha Thomas : ఫ్యామిలీతో నివేదా థామస్ ఓనం సెలబ్రేషన్స్.. ఫొటోలు..
దీని తర్వాత వచ్చే అవెంజర్స్ డూమ్స్ డే స్పెషల్ వీడియో కూడా ఈ రీ రిలీజ్ కి జత చేయనున్నట్టు ప్రకటించింది మార్వెల్ స్టూడియోస్. అవెంజర్స్: డూమ్స్‌డే డిసెంబర్ 18, 2026న థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తాజాగా అవెంజర్స్: ఎండ్‌గేమ్ రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు.
