Avinash Thiruveedhula
Avinash Thiruveedhula : అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమా వనవీర. జనవరి 1న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి ఆసక్తి నెలకొల్పారు. నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ పెట్టగా ఈ ప్రెస్ మీట్ లో హీరో అవినాష్ నందు పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.(Avinash Thiruveedhula)
నటుడు నందు ఓ పక్క హీరోగా చేస్తూనే మరో పక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ వారం క్రిస్మస్ కి రిలీజయిన దండోరా సినిమాలో నందు కీలక పాత్రలో నటించాడు. నందు హీరోగా, నిర్మాతగా చేసిన సైక్ సిద్దార్థ్ సినిమా జనవరి 1న రిలీజ్ కానుంది. అలాగే ఈ వనవీర సినిమాలో నందు కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ వనవీర సినిమా ప్రమోషన్స్ కి నందు రావట్లేదు. నేడు నిర్వహించిన ప్రెస్ మీట్ కి కూడా నందు రాలేదు.
Also Read : Producer SKN : ఏ బట్టల సత్తి గాడి మాటలు వినక్కర్లేదు.. శివాజీ పై నిర్మాత SKN సంచలన వ్యాఖ్యలు..
దీంతో వనవీర హీరో, దర్శకుడు అవినాష్ నందు పేరు చెప్పకుండా ఇన్ డైరెక్ట్ గా మాట్లాడుతూ.. నేను ఒక యాక్టర్ గానో, దర్శకుడిగానే ఇవాళ మాట్లాడట్లేదు. నిర్మాతగా మాట్లాడుతున్నాను. ఈ సినిమా నిర్మాతలు నా స్నేహితులే. నిర్మాతలు బాధలు బయటకు చెప్పుకోలేరు. ప్రమోషన్స్ కి ఈవెంట్స్ పెడతాం, చిన్న చిన్న వీడియోలు, మైక్రో ప్రమోషన్స్, జనాల్లో తిరిగేవి చేస్తాం. మా లాంటి చిన్న సినిమాలకు అవి చాలా ఇంపార్టెంట్. నేను ఒక్కడినే చేస్తే అవి వర్కౌట్ అవ్వవు. నాది కొత్త ఫేస్. అందుకే నా సినిమాలో కొంచెం లీడ్ యాక్టర్స్ పెట్టుకొని సినిమా చేసాను, ప్రమోషన్స్ చేసుకుందాం అనుకున్నాం.
కానీ మేము ఎవరినైతే పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు, సినిమా నడిపిస్తారు అని నమ్మకం పెట్టుకున్నామో వాళ్ళు కనీసం సినిమా గురించి ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఏం చేయమంటారు. లక్షలు లక్షలు రెమ్యునరేషన్స్ తీసుకుంటారు. ఇష్టం లేకపోతే వేరేవి చేసుకోవచ్చు కదా. వాళ్ళ సినిమాలు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ చేసే సినిమాలు ప్రమోట్ చేసుకుంటారు. కానీ మేము ఏం తప్పు చేసాము. కొత్తవాళ్లమనా? అది తప్పు. తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి కదా. మా హీరోయిన్ ప్రమోషన్ చేసింది మాకు. కొత్త నిర్మాతల మీద యాక్టర్స్ యాటిట్యూడ్ మారాలి. మీరు బయటకెళ్ళి నేను మంచోడని, ఇన్నేళ్లు అయింది సక్సెస్ లేదు, కష్టపడతాను, సక్సెస్ అవ్వాలి అని చెప్పుకుంటున్నారు. కానీ మీరు ఒక నిర్మాత దగ్గర తీసుకున్న డబ్బులకు తీసుకున్న దానికి న్యాయం చేయాలి కదా అంటూ ఫైర్ అయ్యాడు.
Also Read : Sivaji Issue : శివాజీకే సపోర్ట్ అంటున్న సోషల్ మీడియా.. ఆ రెండు పదాలు తప్ప.. సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్లు..
అయితే నందు పేరు చెప్పకపోయినా ఈ సినిమాలో నందు నటించాడు, ఇటీవలే నందు ఇన్నేళ్లు అయింది ఇండస్ట్రీకి వచ్చి సక్సెస్ అవ్వాలి అనే కామెంట్స్ ఓ ఇంటర్వ్యూలో చేసాడు. దీంతో నందు పైనే ఈ కామెంట్స్ అంటూ వైరల్ అవుతున్నాయి. మరి నందు దీనికి సమాధానం ఇస్తాడా చూడాలి.