Sivaji Issue : శివాజీకే సపోర్ట్ అంటున్న సోషల్ మీడియా.. ఆ రెండు పదాలు తప్ప.. సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్లు..
ఈ విషయంలో సోషల్ మీడియా, జనాలు అంతా శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు.(Sivaji Issue)
Sivaji Issue
Sivaji Issue : ఇటీవల శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి, హీరోయిన్స్ చక్కగా చీరలు కట్టుకోండి అని చెప్తూ పొరపాటున రెండు అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. కొంతమంది సెలబ్రిటీలు శివాజీపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఈ విషయంలో సోషల్ మీడియా, జనాలు అంతా శివాజీకే సపోర్ట్ చేస్తున్నారు.
కొంతమంది హీరోయిన్స్ ఈవెంట్స్ కి, బయట తమ శరీరభాగాలన్నీ కనపడేలా వేసుకొచ్చే డ్రెసులను ఉద్దేశించి శివాజీ ఆ వ్యాఖ్యలు చేసారు. దీంతో శివాజీ చెప్పింది వంద శాతం కరెక్ట్, కేవలం ఒక రెండు పదాలు తప్పు మాట్లాడారు. ఆ పదాలు తప్పుగా వాడినా ఆయన చెప్పిన విషయం మాత్రం మంచిదే, ఇంట్లో అమ్మానాన్నలు మంచి మాటలు చెప్పరా అంటూ సోషల్ మీడియాలో, బయట జనాలు శివాజీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు.

Sivaji : నా మీద కుట్ర చేస్తున్నారు.. శివాజీ సంచలనం.. నాగబాబు వ్యాఖ్యలపై..
అయితే అనసూయ, నాగబాబు, చిన్మయి, ఝాన్సీ.. మరికొంతమంది నటీనటులు బహిరంగంగానే శివాజీని విమర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు వాళ్ళు గతంలో చేసిన కామెంట్స్, సినిమాల్లో, షోలలో వాళ్ళు మాట్లాడిన అసభ్యకరమైన పదాలు బయటకు తీసి మీరు చేస్తే కరెక్టా అని ప్రశిస్తున్నారు. అంతే కాకుండా ఇంత కన్నా నీచంగా మహిళల గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని ఏమి అనరా అంటూ ప్రశ్నిస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం శివాజీ మాట్లాడింది తప్పు అంటున్నారు.

అయితే శివాజీ ఇప్పటికే నా మాటలకు కట్టుబడే ఉన్నాను, నేను మంచి చెప్పాను, కానీ రెండు పదాలు తప్పుగా మాట్లాడాను అందుకు క్షమాపణలు, మంచి చెప్పకూడదు అని అర్థమైంది అని చెప్పాడు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కావాలని తనపై కుట్ర చేస్తున్నారని మీడియా ముందు మాట్లాడాడు శివాజీ. ఈ వివాదం ఇక్కడితో ఆపేద్దాం అంటూ తన మాటలకు ఎవరైనా హర్ట్ అయితే క్షమాపణలు అని కూడా చెప్పాడు శివాజీ.

Also Read : Naga Babu: అది అసలు తప్పే కాదు.. శివాజీ కామెంట్స్ పై నాగబాబు సీరియస్

కానీ కొంతమంది సెలబ్రిటీలు మాత్రం శివాజీపై ఇంకా కామెంట్స్ చేస్తున్నారు. ఆ సెలబ్రిటీలకు నెటిజన్లు వారి పోస్టుల కిందే శివాజీకి సపోర్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ, చిన్మయి పెట్టిన అన్ని పోస్టులకు శివాజీ వంద శాతం రైట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు కూడా కొంతమంది శివాజీ కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శివాజీ ఇష్యూ సెలబ్రిటీలు వర్సెస్ నెటిజన్లుగా మారింది.


