Sivaji : నా మీద కుట్ర చేస్తున్నారు.. శివాజీ సంచలనం.. నాగబాబు వ్యాఖ్యలపై..
దీంతో శివాజీ నేడు మహిళా కమిషన్ ముందు హాజరయి అనంతరం మీడియాతో మాట్లాడారు.(Sivaji)
Sivaji
Sivaji : ఇటీవల శివాజీ దండోరా సినిమా ఈవెంట్లో అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి అని చెప్తూ పొరపాటున రెండు అసభ్యకరమైన పదాలు వాడారు. దీంతో కొంతమంది శివాజీపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయం మహిళా కమిషన్ వరకు వెళ్లడంతో నోటీసులు ఇచ్చారు. దీంతో శివాజీ నేడు మహిళా కమిషన్ ముందు హాజరయి అనంతరం మీడియాతో మాట్లాడారు.(Sivaji)
మహిళా కమిషన్ విచారణ అనంతరం శివాజీ మాట్లాడుతూ.. నేను సినీ పరిశ్రమలో ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా నా మీద కంప్లైంట్స్ వచ్చేవి. కానీ రాలేదు. చాలా మంది నా మీద మీటింగ్స్ పెట్టుకున్నారు. నాతో బాగా ఉండి, నాతో మంచిగా ఉంటూ నా నటనను పొగుడుతూ ఉన్న వాళ్ళే నా మీద కుట్ర చేస్తున్నారు. నేను అన్న రెండు పదాలకు, ఆవేశంలో అన్న పదాలకు క్షమాపణలు చెప్పాను. అయినా నాకు బాగా కావాల్సిన వాళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారు.
Also Read : Pushpa 2 Incident : పుష్ప2 తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం.. ఏ11గా అల్లు అర్జున్..
మహిళా కమిషన్ చైర్మన్ హుందాగా వ్యవహరించారు. ఆవిడ డ్యూటీ ఆవిడ చేసారు నేను వచ్చాను. నా మీద అంత జెలస్ రావడానికి నేను ఏం తప్పు చేశాను. మీ నాన్న చెప్పడా, మీ అమ్మ చెప్పదా ఇంట్లో ఇలాంటి మంచి మాటలు. అందరూ స్త్రీని మహాలక్ష్మిలానే చూడాలి అనుకుంటారు. ఎవరు బట్టలు ఎలా వేసుకుంటే నాకేంటమ్మా. మీ బట్టలు మీ ఇష్టం. నేను ఒక తండ్రిలాగా నా బిడ్డలు అని భావించి చెప్పాను. కానీ ఇంతకుముందు ఎవరు ఏమి అనలేదా. నా మీదా మీటింగ్స్ పెట్టుకొని కుట్ర చేయాలా.
సినిమా పబ్లిసిటీ కోసం దిగజారాను అని అంటారా? నాకు అంత డబ్బు, ఫేమ్ పిచ్చి ఉంటే రాజకీయాల్లో ఎక్కడో ఉండేవాడిని. సినిమా పబ్లిసిటీ కి చేసేవాడ్ని అయితే 13 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉంటానా? మంచి మాటలు, సలహాలు ఇవ్వకూడదు అని తెలిసింది. మహిళా కమిషన్ అడిగిన వాటికి సమాధానాలు ఇచ్చాను. ఏమన్నా ఉంటే మళ్ళీ కాల్ చేస్తా అన్నారు. ఎవరన్నా నా వల్ల ఇబ్బంది పడ్డారు అని చెప్తే దానికి కూడా సమాధానం చెప్తాను. నాగబాబు కూడా శివాజీ తప్పు అని మాట్లాడటంతో నేను నాగబాబు వ్యాఖ్యలు ఇంకా చూడలేదు కాబట్టి స్పందించాను అని అన్నాడు.
Also Read : Teja Sajja: వైలెన్స్ ముందు వచ్చే సైలెన్స్.. తేజ సజ్జా మాస్టర్ ప్లాన్.. ఇది కదా లైనప్ అంటే..
నేను అన్న మాటల్లో ఏది తప్పు అనిపిస్తే దానికే సారీ. నేను మంచి చెప్పాను. మంచి చెప్పడం కూడా తప్పే. నువ్వెంత నీ బతుకెంత అంటున్నారు. నేను ఎవరికీ భయపడను. బెదిరిస్తే, వార్నింగ్స్ ఇస్తే భయపడను, విలువలు లేని బతుకు నేను బతకట్లేదు. అన్నిటికి కాలం, కర్మ సమాధానం చెప్తుంది. నా మీద కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నాకు సినిమా ఛాన్సులు ఇవ్వకపోతే నాకు 30 ఎకరాలు ఉన్నాయి వెళ్లి వ్యవసాయం చేసుకుంటా అని అన్నారు.
