ఆయుష్మాన్ ‘బాలా’ మూవీ షూటింగ్ ప్రారంభం

ఆయుష్మాన్, భూమి ఫడ్నేకర్, యామి గౌతమ్ మొయిన్ లీడ్స్‌గా నటించనున్న'బాలా' మూవీ షూటింగ్ ప్రారంభం..

  • Published By: sekhar ,Published On : May 6, 2019 / 10:05 AM IST
ఆయుష్మాన్ ‘బాలా’ మూవీ షూటింగ్ ప్రారంభం

Updated On : May 6, 2019 / 10:05 AM IST

ఆయుష్మాన్, భూమి ఫడ్నేకర్, యామి గౌతమ్ మొయిన్ లీడ్స్‌గా నటించనున్న’బాలా’ మూవీ షూటింగ్ ప్రారంభం..

‘అంథా ధున్’, ‘బదాయిహో’ సినిమాలతో వరస విజయాలు అందుకున్న బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆయుష్మాన్, భూమి ఫడ్నేకర్, యామి గౌతమ్ మొయిన్ లీడ్స్‌గా నటించనున్న ఈ ఫిలింకి, ‘ఆబా’, ‘స్త్రీ’ సినిమాల ఫేమ్ అమర్ కౌషిక్ దర్శకత్వం వహిస్తుండగా, దినేష్ విజాన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ‘బాలా’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

ఈ చిత్ర విశేషాలను ప్రముఖ బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు. ఈ సందర్భంగా టైటిల్‌తో డిజైన్ చేసిన పోస్టర్ రిలీజ్ చేసారు. బట్టతలపై బాలా టైటిల్‌తో రూపొందించిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఆయుష్మాన్, భూమి కలిసి నటిస్తున్న మూడో సినిమా ఇది. సౌరభ్ శుక్లా, జావేద్ జాఫ్రీ, సీమా పావా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.