×
Ad

Baahubali Collections : బాహుబలి రీ రిలీజ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లు..? రాజమౌళి టార్గెట్ వర్కౌట్ అవ్వలేదా?

ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. మళ్ళీ ఒరిజినల్ సినిమా రిలీజ్ అయినట్టే హైప్ తెచ్చారు. (Baahubali Collections)

Baahubali Collections

Baahubali Collections : తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచి సరికొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా రెండూ భారీ విజయం సాధించి కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఇటీవల ఈ రెండు సినిమాలను కలిపి ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ భారీగా రిలీజ్ అయింది.(Baahubali Collections)

ఈ సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. మళ్ళీ ఒరిజినల్ సినిమా రిలీజ్ అయినట్టే హైప్ తెచ్చారు. బుకింగ్స్ కూడా భారీగా అయ్యాయి. అప్పట్లో థియేటర్స్ బాహుబలి సృష్టించిన వైబ్ మళ్ళీ థియేటర్స్ లో సందడి చేసింది. అయితే ఈ సినిమాకు రీ రిలీజ్ లో దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ వస్తాయని అంచనా పెట్టుకున్నారు. ప్రమోషన్స్ ఏమి లేకపోయినా రాజమౌళి స్ట్రేటజీతోనే హైప్ వచ్చి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఇది కేవలం తెలుగులోనే. వేరే భాషల్లో రిలీజ్ చేసినా అంత రెస్పాన్స్ రాలేదు.

Also See : Kajal Aggarwal : భర్తతో కాజల్ అగర్వాల్ వెకేషన్.. ఆస్ట్రేలియాలో ఫుల్ ఎంజాయ్.. ఫొటోలు..

అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ లో బుకింగ్స్ అదిరిపోవడంతో 100 కోట్లు కంఫర్మ్ అనుకున్నారు. కానీ బాహుబలి ది ఎపిక్ సినిమా ఇప్పటివరకు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అంచనా రీచ్ అవ్వకపోయినా రీ రిలీజ్ లలో ఇప్పటివరకు అత్యధికంగా కలెక్టు చేసిన సినిమాగా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

ఇప్పటివరకు సనమ్ తేరి కసం – 42 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత తుంబాడ్ -38 కోట్లు, ఘిల్లి – 32 కోట్లు, ఏ జవానీ హై దివాని – 26 కోట్లతో రీ రిలీజ్ లలో టాప్ లో ఉన్నాయి ఇండియా వైడ్. ఇప్పుడు ఆ రికార్డులను దాటి బాహుబలి 45 కోట్లతో టాప్ లో నిలిచింది. ప్రస్తుతం ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది కాబట్టి రౌండ్ ఫిగర్ 50 కోట్లు గ్రాస్ రావొచ్చని అంచనా అవేస్తున్నారు.

Also Read : Baahubali The Eternal War : ‘బాహుబలి ది ఎటర్నల్ వార్’ టీజర్ వచ్చేసింది.. బాహుబలి నెక్స్ట్ పార్ట్ అదిరిందిగా.. తన మరణం ముగింపు కాదు..

అయితే బాహుబలి మీద ఉన్న హైప్ కి ప్రమోషన్స్ చేస్తే, వేరే భాషల్లో కూడా ప్రమోషన్స్ చేసి ఉంటే కలెక్షన్స్ ఇంకా ఎక్కువ వచ్చేవని ప్రభాస్ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. 100 కోట్ల టార్గెట్ మిస్ అయినా రీ రిలీజ్ లో టాప్ పొజిషన్ వచ్చిందని సంతోషిస్తున్నారు.