×
Ad

Baahubali: The Epic OTT: ఓటీటీకి వచ్చేసిన ‘బాహుబలి: ది ఎపిక్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ ప్రైడ్ బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic OTT) సినిమాను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్.

Baahubali: The Epic Movie released on OTT.

Baahubali: The Epic OTT: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఇండియన్ సినిమా ప్రైడ్ మూవీ బాహుబలి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా బాహుబలి. భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి 1, బాహుబలి 1 సినిమాలు బాక్సాఫీస్ ను షాక్ చేశాయి. మొదటి భాగం రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా రెండో భాగంగా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్(Baahubali: The Epic OTT) పేరుతో ఒకే ప్రాజెక్టుగా రూపొందించాడు దర్శకుడు.

Deepika Pilli: బుల్లితెర బ్యూటీ దీపికా పిల్లి.. నడుమందాలు చూపిస్తూ గ్లామర్ ట్రీట్.. ఫొటోస్

మూడు గంటల నలభై నిమిషాల నిడివితో వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. అయితే, బాహుబలి: ది ఎపిక్ ను తాజాగా ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 25 అర్దరాత్రి నుంచి ఈ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి అనే ఇంటర్నేషనల్ మూవీ చేస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.