వర్మ విల్లు ఎక్కు పెట్టాడు – ‘బాబు చంపేస్తాడు’ లిరికల్ సాంగ్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' నుండి 'చంపేస్తాడు బాబు చంపేస్తాడు' సాంగ్ రిలీజ్ చేసిన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ..

  • Published By: sekhar ,Published On : September 24, 2019 / 11:44 AM IST
వర్మ విల్లు ఎక్కు పెట్టాడు – ‘బాబు చంపేస్తాడు’ లిరికల్ సాంగ్

Updated On : September 24, 2019 / 11:44 AM IST

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుండి ‘చంపేస్తాడు బాబు చంపేస్తాడు’ సాంగ్ రిలీజ్ చేసిన కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ..

కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ముందుగా చెప్పినట్టుగానే బ్రహ్మ ముహూర్తంలో తన కొత్త సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ నుండి ‘చంపేస్తాడు బాబు చంపేస్తాడు’ సాంగ్ రిలీజ్ చేశాడు. రవి శంకర్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా, వర్మ ఆస్థాన రచయిత సిరాశ్రీ లిరిక్స్ రాశాడు. వర్మ పాడాడు.

‘మనిషి చెంపమీద కొడితే తట్టుకోగలడు.. కాళ్ల మధ్య తంతే నిలదొక్కుకోగలడు.. కానీ, అహం మీద కొడితే.. చంపేస్తాడు.. బాబు చంపేస్తాడు’.. అనే పల్లవితో సాగే  ఈ పాటలో వర్మ విల్లు ఎక్కు పెట్టింది నారా చంద్రబాబు నాయుడి మీదే అనేది క్లియర్‌గా అర్థమవుతుంది.

Read Also : గద్దలకొండ గణేష్ టీమ్‌ను అభినందించిన ‘మెగాస్టార్’, ‘సూపర్ స్టార్’..

సాంగ్ స్టార్టింగ్‌లోనే ఈ పాటకు ప్రేరణ కల్గించిన రాజకీయ పరిస్థితుల గురించి వివరించిన వర్మ.. పాట మొత్తం బాబునే టార్గెట్ చేశాడు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాతో వర్మ ఇంకెన్ని కాంట్రవర్శీలు క్రియేట్ చేస్తాడో చూడాలి..