Baby Director Sai Rajesh Shares his Experience on Social Media
గతేడాది ‘బేబీ’ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాగా విడుదలై భారీ బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రధాన పాత్రలో నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లకు ఎంత పేరు వచ్చిందో ఈ చిత్ర దర్శకుడు సాయి రాజేశ్‌కి అంతకంటే మంచి గుర్తింపు వచ్చింది. సాయి రాజేశ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తనపై వచ్చే విమర్శలకు సైతం సరదాగా సమాధానం ఇస్తుంటారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తన ఫ్రెండ్ యొక్క స్నేహితుడి ఇంటికి వెళ్లిన సాయి రాజేశ్‌కు వింత అనుభవం ఎదురైందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద, తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను. ” ‘నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం.. 50 సార్లు చూసుంటాడు.. ఇన్నేళ్ల మా స్నేహం లో ఏదిఆడగలేదు.. నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు’. అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను.
Swapna Varma : టాలీవుడ్‌లో విషాదం.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య..
10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం. ఎంత గొప్ప సినిమా సర్ అని.. వాళ్ల ఆవిడకి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్ కి, కొరియర్ బాయ్ కి, సార్ తో సెల్ఫీ దిగండి, ‘బేబీ సినిమా డైరెక్టర్’ అని 30 ఫోటో లు ఇప్పించారు. ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు. ‘మా అమ్మాయికి సమంత అంటే చాలా ఇష్టమండి.. ఒక ఫోటో ఇప్పించండి.. మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడ’ తో అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి.” అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు.
ఇక్కడ సాయి రాజేశ్ తీసిన సినిమా ‘బేబీ’. అయితే.. సదరు వ్యక్తి సమంత నటించిన ‘ఓ బేబీ’ అని పొరబడ్డాడు. మరీ ఈ విషయాన్ని అతడికి సాయి రాజేశ్ చెప్పాడో లేదో తెలియదు గానీ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అందరికి మాత్రం చెప్పాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. మీ కష్టం పగొడికి కూడా రాకూడదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.