Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..

బేబీ మూవీ పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆగ్రహం చేయగా దర్శకుడు సాయి రాజేష్ రియాక్ట్ అవుతూ..

Baby Movie : బేబీ సినిమాపై సీపీ ఆగ్రహం.. స్పదించిన దర్శకుడు సాయి రాజేష్..

Baby Movie director Sai Rajesh reaction on CP CV Anand comments

Updated On : September 15, 2023 / 7:14 AM IST

Baby Movie : ఇటీవల బేబీ మూవీ పై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మాదకద్రవ్యాలు కేసులో నార్కోటిక్ పోలీసులు మాదాపూర్ లో ఒక ముఠాని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను మీడియాకి తెలియజేస్తున్నా సమయంలో కమిషనర్ సీవీ ఆనంద్.. బేబీ మూవీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమాలో డ్రగ్స్ ఎలా ఉపయోగించాలో చూపించారని, ఆ సీన్స్ కి మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్ మెంట్ లో కనిపించిన సన్నివేశాలకు పెద్ద తేడాలేదని ఆయన పేర్కొన్నాడు.

Ramanna Youth : రామన్న యూత్.. లీడర్స్ వెనక తిరిగే ప్రతి యూత్ చూడాల్సిన సినిమా..

ఇలాంటి సన్నివేశాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమను కోరుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఎలాంటి హెచ్చరికలు వేయకుండా డ్రగ్స్ వినియోగాన్ని సినిమాల్లో చూపించిన బేబీ నిర్మాతలకు నోటీసులు పంపిస్తామంటూ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. తాజాగా దీని పై దర్శకుడు సాయి రాజేష్ స్పందించాడు. సీవీ ఆనంద్ ని కలిసి ఆయనకు వివరణ ఇచ్చాడు. సీవీ ఆనంద్ చూపించిన వీడియో యూట్యూబ్ కి సంబంధించిందని, సినిమాలో చూపించిన వీడియోలో హెచ్చరిక వేసినట్లు సాయి రాజేష్ తెలియజేసాడు.

Kollywood : ఆ నాలుగు హీరోలకు తమిళనాడులో నిషేధం.. నిర్మాత మండలి నిర్ణయం..!

అనంతరం మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. మూవీలో డ్రగ్స్ సన్నివేశాలు పెట్టడానికి గల కారణం పోలీసులకు తెలియజేసినట్లు సాయి రాజేష్ వెల్లడించాడు. మాదకద్రవ్యాలు వాడకూడదు అనే విషయాన్ని మా సినిమా ద్వారా కూడా తెలియజేయాలనే ఆ సీన్స్ పెట్టాము. కానీ దానిలో మంచి వదిలేసి చెడుని మాత్రమే చూస్తే తాము ఏమి చేయలేమని పేర్కొన్నాడు. ప్రస్తుతం పోలీసులు తమకి అడ్వైజరీ నోటీస్ మాత్రమే ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.