Baby Movie is getting ready for remake into Bollywood
Baby Movie : ఈ ఏడాది ఒక చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చి సంచలన విజయం అందుకున్న మూవీ ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వంలో శ్రీనివాస కుమార్ (SKN) నిర్మించిన ఈ సినిమా.. కేవలం 10 కోట్లతో తెరకెక్కి బాక్స్ ఆఫీస్ వద్ద 90 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. కలెక్షన్స్ పరంగానే కాకుండా థియేటర్స్ లో 50 రోజులు పండగని, ఓటీటీలో అతితక్కువ టైంలోనే 100 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించి సంచలనం సృష్టించింది. ఇక ఇంతటి విజయం సాధించిన ఈ సినిమా పై ఇతర పరిశ్రమల మేకర్స్ దృష్టి పడింది.
ఈక్రమంలోనే ఈ మూవీని బాలీవుడ్ లోకి రీమేక్ చేయడానికి రంగం సిద్దమవుతుందట. తెలుగులో డైరెక్ట్ చేసిన సాయి రాజేశే హిందీలో కూడా తెరకెక్కించనున్నాడట. ఆల్రెడీ హిందీ రీమేక్ స్క్రిప్ట్ పనులు కూడా మొదలయ్యాయని సమాచారం. బాలీవుడ్ రైటర్స్ తో హిందీ డైలాగ్స్ అండ్ స్క్రీన్ ప్లే సిద్ధం చేస్తున్నాడట సాయి రాజేశ్. ఇక ఈ సినిమాతో ఒక స్టార్ హీరో కొడుకుని యాక్టర్ గా లాంచ్ చేయబోతున్నారట. అలాగే ఇక్కడ వైష్ణవి తేజ్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చి లైఫ్ ఇచ్చిన దర్శకుడు.. బాలీవుడ్ లో కూడా అదే ఫార్ములాని అప్లై చేస్తున్నాడట.
Also read : Alphonse Puthren : సినిమాలకు ‘ప్రేమమ్’ డైరెక్టర్ గుడ్‌బై.. కారణం ఏంటంటే..?
హిందీ సోషల్ మీడియా వర్గాల్లో క్రేజ్ సంపాదించుకున్న ముగ్గురు అమ్మాయిల పేర్లను పరిశీలిస్తున్నారట. వారిలో ఒకర్ని ఫైనల్ చేసి హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడు. అయితే ఈ రీమేక్ వార్త గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు ఎవరు అన్నది కూడా ఆసక్తిగా మారింది. కాగా సాయి రాజేశ్ రీసెంట్ గా తెలుగులో రెండు సినిమాలు లాంచ్ చేశాడు. నిర్మాతగా ఈ రెండు సినిమాలను సాయి రాజేశ్ తెరకెక్కిస్తున్నాడు.