Baby Movie : ఆహాలోకి వచ్చేస్తున్న ‘బేబీ’ మూవీ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

జూలై 14న థియేట‌ర్ల‌లో విడుద‌లైన బేబీ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని చాలా మంది ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు.

Baby Movie : ఆహాలోకి వచ్చేస్తున్న ‘బేబీ’ మూవీ.. డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

Baby Movie OTT update streaming in AHA from august 25th

Updated On : August 18, 2023 / 10:27 AM IST

Baby Movie OTT : ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda), వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) లు ప్రధాన పాత్రల్లో సాయి రాజేశ్ (Sai Rajesh) ద‌ర్శ‌క‌త్వంలో శ్రీనివాస కుమార్ (SKN) నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘బేబీ’. చిన్న సినిమాగా రిలీజయిన బేబీ యూత్ ని బాగా ఆకట్టుకొని భారీ విజయం సాధించింది. ఎవరూ ఊహించనంత భారీ విజయం సాధించి ఇప్పటివరకు ఏకంగా 90 కోట్ల‌కు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో హిట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు.

జూలై 14న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని చాలా మంది ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. నెల రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా ఇటీవల ఓటీటీలోకి వచ్చేస్తుంది. బేబీ బాగా హిట్ అవ్వడంతో థియేటర్స్ లో ఇంకా కొన్ని చోట్ల నడుస్తుండటంతో సినిమాని ఓటీటీలో లేట్ గా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా బేబీ సినిమా ఓటీటీ అప్డేట్ వచ్చేసింది .

Josh Ravi : అప్పుడు రెండు వేలు ఇచ్చారు.. ఇప్పుడు రెండు లక్షలు ఇస్తా అన్నా జబర్దస్త్ కి వెళ్ళను..

తెలుగు ఓటీటీ ఆహాలోకి బేబీ సినిమా రాబోతుంది. ఆగస్టు 25 నుంచి బేబీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుంది. తాజాగా ఈ విషయాన్ని ఆహా తన సోషల్ మీడియాలో తెలియచేసింది. దీంతో ఈ సినిమా అభిమానులు మరోసారి బేబీని చూడటానికి రెడీ అయిపోయారు.