Badmashulu : విలేజ్ ఓరియెంటెండ్‌ కామెడీ మూవీ.. ‘బద్మాషులు’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘బద్మాషులు’.

Badmashulu : విలేజ్ ఓరియెంటెండ్‌ కామెడీ మూవీ.. ‘బద్మాషులు’ రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Badmashulu movie release date Fix

Updated On : May 11, 2025 / 11:54 AM IST

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం ‘బద్మాషులు’. శంకర్ చేగూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి.బాలకృష్ణ, సి.రామ శంకర్ లు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన ఈ చిత్ర‌ ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న ప్రేక్ష‌కుల ముందుక రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. దీపా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తోంది.

Bhairavam : ‘భైర‌వం’ నుంచి ముగ్గురు హీరోల‌ మ‌ల్టీ స్టార‌ర్ సాంగ్ వ‌చ్చేసింది..

ఆకట్టుకునే కథనం, గ్రామీణ నేపథ్యంలో సహజమైన హాస్యంతో రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించనుంది. ద‌ర్శ‌కుడు శంకర్ చేగూరి రిఫ్రెషింగ్ టేకింగ్‌తో, అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను రెండు గంట‌ల పాటు న‌వ్వించేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిచంరు. ఈ చిత్రంలోని పాత్ర‌లు చాలా స‌హ‌జంగా ఉండ‌డంతో.. మ‌న ఊరి క‌థ అనే భావ‌న‌ను క‌లిగిస్తాయి.