Rajamouli: బాహుబలి-3 కూడా ఉంటుంది.. జక్కన్న క్లారిటీ

‘బాహుబలి’తో తనని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. ఇప్పుడు దేశంలోని గొప్ప డైరెక్టర్స్ లో..

Rajamouli

Rajamouli: ‘బాహుబలి’తో తనని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేశాడు దర్శక ధీరుడు రాజమౌళి. అంతే కాదు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాడు. ఇప్పుడు దేశంలోని గొప్ప డైరెక్టర్స్ లో రాజమౌళి ఒకరు. అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలా మంది హీరోలు, హీరోయిన్స్ రాజమౌళితో కలిసి పని చేయాలి అని అనుకుంటున్నారు. ఆయన పిలుపు కోసమే దేశంలో ఏ ఇండస్ట్రీలో నటీనటులైనా ఒకే అనేలా చేసుకున్నారు రాజమౌళి. ఇంత ఖ్యాతికి మూలం బాహుబలి సినిమానే. రెండు పార్టులుగా వచ్చిన బాహుబలి ఏ బాలీవుడ్ సినిమాకి కూడా సాధ్యం కాని రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టింది.

Rajamouli: జక్కన్న చేతిలో మరో మల్టీస్టారర్.. అభిమానుల ఎదురుచూపులు!

అందులో నటించిన రెబల్ స్టార్ ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసిన బాహుబలి సినిమా తెలుగు సినిమా బ్రాండ్ ను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేసింది. బాహుబలి ఫస్ట్ పార్ట్ తర్వాత సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో ఎదురుచూశారు ప్రేక్షకులు. అంతటి క్రేజీ సినిమాకి మూడో పార్ట్ కూడా ఉంటుందా? ఉంటే అందులో హీరోగా ఎవరు నటిస్తారు? విలన్ గా రానానే నటిస్తారా? సినిమాకి కీలకమైన కట్టప్ప పాత్ర థర్డ్ పార్ట్ లో కూడా ఉంటుందా? ఇలా ఎన్నోసార్లు చర్చలు కూడా జరిగాయి.

Rajamouli: తారక్ కోసం జక్కన్న వద్ద మరో మూడు కథలు!

అయితే.. వాటిపై దర్శకుడు రాజమౌళి ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు తొలిసారి బాహుబలి థర్డ్ పార్ట్ పై రాజమౌళి స్పందించారు. ప్రస్తుతం క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో ఉన్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలికి థర్డ్ పార్టీ ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఇందులో బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను చూపించనున్నామని.. నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. ఇప్పటికే దీనిపై వర్క్ చేస్తున్నాం కానీ ఈ సినిమాకి కాస్త టైం పట్టొచ్చని.. తప్పకుండ బాహుబలి నుండి ఆసక్తికర వార్త వస్తుందని చెప్పారు.