Rajamouli: జక్కన్న చేతిలో మరో మల్టీస్టారర్.. అభిమానుల ఎదురుచూపులు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించే చిత్రాల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

Rajamouli: జక్కన్న చేతిలో మరో మల్టీస్టారర్.. అభిమానుల ఎదురుచూపులు!

New Multistarrer In Hands Of Rajamouli

Rajamouli: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించే చిత్రాల కోసం కేవలం తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషల్లోని ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆయన టేకప్ చేసే సినిమాలు యూనివర్సల్ కథను కలిగి ఉండటమే దీనికి కారణం. ఇక ప్రస్తుతం యావత్ ఇండియన్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను జక్కన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేయబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

Rajamouli: తారక్ కోసం జక్కన్న వద్ద మరో మూడు కథలు!

అయితే ఈ సినిమా తరువాత జక్కన్న మరో మల్టీస్టారర్ చేయబోతున్నాడా.. అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ మల్టీస్టారర్ మూవీ గురించి గతంలో ఎలాంటి ప్రస్తావన లేకున్నా, ఇటీవల ఈ సినిమాపై జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి రాజమౌళి ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను కూడా గతంలో జక్కన్న అధికారికంగా చేశాడు. అయితే ఈ సినిమాలో మరో స్టార్ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

RRR: ప్రమోషన్స్‌తో దూసుకుపోనున్న ఆర్ఆర్ఆర్ టీమ్

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవల హోస్ట్‌గా మారి చేసిన ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఈ టాక్ షోలో భాగంగా జక్కన్న మహేష్ బాబు సినిమా గురించి ప్రస్తావించాడు. అయితే ఈ సినిమాలో మరో హీరో నటించే ఆస్కారం ఉందనే క్లూ వదిలాడు ఈ క్లాసిక్ డైరెక్టర్. ఆ హీరో మరెవరో కాదు, స్వయంగా బాలయ్యే అని తెలుస్తోంది. బాలయ్యతో జక్కన్న కూడా ఓ సినిమా చేయాలని ఎప్పటినుండో చూస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. దీంతో ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోయే సినిమాలో బాలయ్యకు ప్రాధాన్యత ఉన్న పాత్రను ఇవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట.

Prabhas : రాజమౌళికి నాకంటే చరణ్, తారక్‌లే ఎక్కువ

ఈ సినిమాలో మహేష్ పాత్రకు ఏమాత్రం తీసిపోకుండా ఈ పాత్రను డిజైన్ చేస్తున్నాడట రాజమౌళి. దాదాపు 40 నిమిషాల పాటు బాలయ్య పాత్ర నిడివి ఉంటుందని, ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్య-మహేష్ బాబు కాంబోను వెండితెరపై చూసేందుకు ఇద్దరు హీరోల అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. మరి జక్కన్న వీరిద్దరిని ఎలాంటి కథతో కలుపుతాడా.. వారిని ఏ విధంగా చూపిస్తాడా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ మాస్టర్ డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ చిత్ర రిలీజ్ కోసం భారీ ఎత్తున ప్రమోషన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.