Rajamouli: తారక్ కోసం జక్కన్న వద్ద మరో మూడు కథలు!

ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనుడు. కొందరు కాదన్నా.. బాహుబలికి ముందు తెలుగు సినిమా స్థాయి వేరు.

Rajamouli: తారక్ కోసం జక్కన్న వద్ద మరో మూడు కథలు!

Rajamouli

Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు పెట్టింది పేరు. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ఘనుడు. కొందరు కాదన్నా.. బాహుబలికి ముందు తెలుగు సినిమా స్థాయి వేరు.. బాహుబలి తర్వాత తెలుగు సినిమా మార్కెట్ వేరు. ఇది రాజమౌళికి దక్కాల్సిన క్రెడిటే. సౌత్ నుండి నార్త్ వరకు హీరోలు-హీరోయిన్స్ ఆయన సినిమాలో అవకాశం వస్తే మిస్ చేసుకొనే ఛాన్స్ లేదు. ఆయన పిలుపు కోసమే ఎదురుచూసే నటీనటులు ఎందరో ఓపెన్ గానే చెప్పేశారు.

Mahesh-Rajamouli: జక్కన్న లెక్క.. మహేష్ సినిమా వచ్చే ఏడాదేనా?

అలాంటి రాజమౌళి నుండి రాబోతున్న క్రేజీ పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. చరిత్రలో జరగదు అని ఆనాడు అనుకున్న మెగా-నందమూరి ఫ్యామిలీతో మల్టీస్టారర్ సెట్ చేసిన ఘనత ఆయనకే దక్కగా.. అందులో నటించిన హీరోలతో రాజమౌళికి ఒకరికి నాలుగో సినిమా కాగా.. మరొకరికి రెండో సినిమా. ఈ సినిమా తర్వాత ఈ హీరోలిద్దరూ పాన్ ఇండియాను శాసించే హీరోలు అవుతారని ఓ ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఎలాంటి జానర్ లో సినిమా చేయనున్నాడనే ఉత్సుకత కూడా ప్రేక్షకులలో కనిపిస్తుంది.

Rajamouli: ఫస్ట్ టైమ్ ఫ్యామిలీకి ఎలివేషన్ ఇచ్చిన జక్కన్న!

కాగా.. రాజమౌళి ఎన్టీఆర్ కోసం ఎప్పుడో మూడు కథలను సిద్ధం చేశాడా అంటే అవుననే సమాధానం వినిపించింది. తాజాగా రాధేశ్యామ్ ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి ప్రభాస్ ను ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీకు నాకంటే తారక్ .. చరణ్ అంటే ఇష్టమనే విషయం అర్థమైందని ప్రభాస్ సరదాగా రాజమౌళిని టీజ్ చేస్తూ యమదొంగ నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. యమదొంగ సినిమా టైములో రాజమౌళిని కలిసిన ప్రభాస్ కు తారక్ కోసం రెండు మూడు కథలు రెడీగా ఉన్నాయని చెప్పారట.

Allu Arjun-Rajamouli: బన్నీతో జక్కన్న.. క్రేజీ కాంబో సెట్టయినట్లే!

అంతేకాదు మళ్లీ తారక్ తో చేయబోయే కథ ఇదేనని స్టోరీ లైన్ కూడా చెప్పేవారట. ప్రభాస్ ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ చర్చ నడుస్తుంది. అప్పుడు తారక్ కోసం అనుకున్న లైన్స్ రాజమౌళి పక్కన పెట్టారా లేక భవిష్యత్ లో ఎన్టీఆర్ తో చేయనున్నాడా అనే చర్చ మొదలైంది. తనతో పనిచేసిన అందరి హీరోలను తన కుటుంబ సభ్యులలాగే చూసుకొనే రాజమౌళి వద్ద తారక్ కు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కెరీర్ తొలినాళ్ళలో తీసిన ఆరు సినిమాలలో తారక్ తోనే మూడు సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన రాజమౌళికి ఎన్టీఆర్ ఎప్పుడూ ప్రత్యేకమే.

Mahesh-Rajamouli: ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా మహేష్-రాజమౌళి సినిమా?

సందర్భాన్ని బట్టి రాజమౌళి కూడా ఎన్టీఆర్ తో అనుబంధాన్ని పంచుకోగా.. తన క్యాలిబర్ ఏంటో కూడా చెప్పేవారు. అయితే.. మారిన పరిస్థితుల కారణంగానే ఇప్పుడు రాజమౌళి ఇతర హీరోలతో కూడా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు అనుకున్న కథలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి అనుకున్నా.. మిగతా రెండు సినిమాలు ఎప్పుడు ఉంటాయి.. అసలు ఉంటాయా అన్నది ఆసక్తిగా మారింది. రాజమౌళి నెక్స్ట్ మహేష్ తో సినిమా చేయాలి. ఆ తర్వాత ఒకవేళ ఆ స్టోరీ లైన్స్ తో సినిమాలు చేయాలన్నా అవుట్ డేటెడ్ అయిపోతాయేమో కానీ తారక్ కోసం రాజమౌళి అప్పుడే మూడు కథలు అనుకోడం అనే విషయం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.