Nora Fatehi: యెల్లో డ్రెస్‌లో బాహుబలి భామ.. పిక్స్ వైరల్!
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలిలో మనోహరి పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఇరుక్కుపో... హత్తుకోని వీరా వీరా... కొరుక్కుపో... నీ తనివితీరా తీరా... అంటూ సెగలు రేపిన నోరా ఫ

Nora Fatehi
Nora Fatehi: టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి బాహుబలిలో మనోహరి పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఇరుక్కుపో… హత్తుకోని వీరా వీరా… కొరుక్కుపో… నీ తనివితీరా తీరా… అంటూ సెగలు రేపిన నోరా ఫతేహి బాలీవుడ్‌లో ఐటెం భామగా సత్తా చూపెడుతుంది. బాహుబలి కంటే ముందే ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్‌లో ఇట్టాగే రెచ్చిపోనా సాంగ్‌తో పాపులర్ అయిన నోరా ఆ తర్వాత కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడింది.
సినీ అభిమానులకు ముఖ్యంగా డ్యాన్స్ లవర్లకు నోరా అంటే ఓ కలల రాకుమారే. అయితే నోరా ఒక్క డ్యాన్సర్ మాత్రమే కాదు.. మోడల్, సింగర్, నటి, రియలిటీ షోకు జడ్జిగా ఇలా అన్ని రంగాల్లో ఇప్పటికే తనదైన ముద్ర వేసుకుంది. అయితే, ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్‌ను అయిన తన సైల్లో అవలీలగా చేస్తూ కుర్రకారును మతిపోగొట్టే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంటుంది. కెనడాలోని టొరంటోలో పెరిగిన నోరా ఇండియాలో ఫేమస్ కాగా ఈ మధ్యనే మళ్ళీ కెనడాకు వెళ్లి వచ్చిందట.
కెనడా టూర్ లో భాగంగా అక్కడ విహరించిన ఈ అందాల ముద్దుగుమ్మ తన క్యూట్ లుక్ ఒకటి షేర్ చేసింది. ఇందులో నోరా మిషో డిజైన్ల నుండి చెవిపోగులు, ఉంగరాలతో లేయర్డ్ గోల్డ్ చోకర్ తో ఎంతో సొంపుగా కనిపిస్తోంది. ప్రస్తుతం నోరా పిక్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. చివరిగా భుజ్ చిత్రంలో నటించిన నోరా ఫతేహి ప్రస్తుతం సత్యమేవ జయతే 2తో పాటు పలు సినిమాలలో నటిస్తుంది. సినిమాల సంగతెలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం నోరా భారీ అభిమానులను సంపాదించుకుంటుంది.