Aditya 369 : బాల‌య్య అభిమానులకు శుభ‌వార్త‌.. ఆదిత్య 369 రీ రిలీజ్ ముందే వచ్చేస్తోంది.. కొత్త డేట్ ఇదే..

బాల‌కృష్ణ న‌టించిన చిత్రాల్లో ఆదిత్య 369 కి ఓ ప్ర‌త్యేక స్థానం ఉన్న సంగ‌తి తెలిసిందే.

Balakrishna Aditya 369 movie re release on April 4th 2025

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన చిత్రాల్లో ఆదిత్య 369 కి ఓ ప్ర‌త్యేక స్థానం ఉన్న సంగ‌తి తెలిసిందే. లెజండరీ డైరెక్ట‌ర్‌ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం తెర‌కెక్కింది. 1991లో విడుద‌లైన ఈ చిత్రం భారీ విజ‌యాన్ని సాధించింది. అప్ప‌ట్లో ప్రేక్ష‌కుల‌ను ఓ స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకుపోయింది. శ్రీదేవీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని మూడు ద‌శాబ్దాల త‌రువాత మ‌రోసారి థియేట‌ర్ల‌లోకి తీసుకువ‌స్తున్నారు.

4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా ఏప్రిల్ 11న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు తెలిపారు. అయితే.. తాజాగా ఈ చిత్రాన్ని మ‌రో వారం రోజుల ముందుగానే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ తెలిపారు.

David Warner : రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ స్పీచ్‌.. ఆఖ‌రిలో తెలుగులో చెప్పిన డైలాగ్ అదుర్స్‌.. ఎవ‌రు మామ అదీ..

శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా రెండు విభిన్న పాత్రల్లో నందమూరి బాలకృష్ణ అద్భుతంగా న‌టించార‌న్నారు. తెలుగు చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచేలా ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టి టెక్నిక‌ల్ హంగుల‌తో మ‌రింత గొప్ప అనుభూతిని అందించేలా ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధ‌మైంది. సాధ్య‌మైన‌న్ని ఎక్కువ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసేందుకు ఇప్పుడు వారం రోజుల ముందుగానే అంటే ఏప్రిల్ 4నే ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

Tollywood : సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దిల్ రాజు మాటలు

ఈ చిత్రంలో మోహిని, హీరో తరుణ్, సిల్క్ స్మిత, శుభలేఖ సుధాకర్, చలపతిరావు, చంద్రమోహన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.