David Warner : రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ స్పీచ్‌.. ఆఖ‌రిలో తెలుగులో చెప్పిన డైలాగ్ అదుర్స్‌.. ఎవ‌రు మామ అదీ..

రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్న‌ర్ మాట్లాడిన మాట‌లు వైర‌ల్ అవుతున్నాయి.

David Warner : రాబిన్‌హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వార్న‌ర్ స్పీచ్‌.. ఆఖ‌రిలో తెలుగులో చెప్పిన డైలాగ్ అదుర్స్‌.. ఎవ‌రు మామ అదీ..

David Warner speech in Robinhood pre release event

Updated On : March 24, 2025 / 9:35 AM IST

సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చేందుకు ముందుగా కాస్త టెన్ష‌న్ ప‌డ్డానని ఆస్ట్రేలియా మాజీ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ తెలిపాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన వార్న‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ లీగుల్లో మాత్ర‌మే ఆడుతున్నాడు. ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో వార్న‌ర్ ను ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయ‌లేదు. దీంతో వార్న‌ర్ ను ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చూసే అదృష్టం లేక‌పోయింది. అయిన‌ప్ప‌టికి నితిన్ హీరోగా న‌టించిన రాబిన్ హుడ్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టాడు వార్న‌ర్‌.

రాబిన్ హుడ్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ముఖ్య అతిథిగా డేవిడ్ వార్న‌ర్ విచ్చేసి మాట్లాడాడు. త‌న ప్ర‌సంగాన్ని తెలుగులో ప్రారంభించాడు. న‌మ‌స్కారం అని ప‌ల‌క‌రించాడు. గ‌త కొన్నాళ్లుగా త‌న‌పై అంద‌రూ చూపిన ప్రేమ‌, మ‌ద్ద‌తు హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

Tollywood : సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దిల్ రాజు మాటలు

ఇక టాలీవుడ్‌లో న‌టించ‌డం పై మాట్లాడుతూ.. సినీ ఇండ‌స్ట్రీలో వ‌చ్చేందుకు కొంచెం భ‌య‌ప‌డిన‌ట్లుగా వార్న‌ర్ చెప్పుకొచ్చాడు. అయితే.. రాబిన్ హుడ్ టీమ్ త‌న‌కు ఎంతో స‌పోర్ట్ ఇచ్చింద‌న్నాడు.

‘ఇక ఈ చిత్రంతో మీ కుటుంబంలో న‌న్ను చేర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా, గౌర‌వంగా ఉంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యాన్ని సాధిస్తుంది. మూవీ టీమ్ ఎంతో క‌ష్ట‌ప‌డింది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికి ఈ సినిమా న‌చ్చుతుంది.’ అని వార్న‌ర్ అన్నాడు.

David Warner : రేయ్.. నువ్వు పెద్ద దొంగ.. అంటూ.. స్టేజ్ పైనే డేవిడ్ వార్నర్ ను తిట్టేసిన రాజేంద్రప్రసాద్..

రాబిన్‌హుడ్ దర్శకుడు వెంకీ కుడుముల తెలుగులో ఏదైనా చెప్పమని అడిగారు. ఇందుకు “నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి వార్న‌ర్ అంద‌రిని అల‌రించాడు.

నితిన్‌, శ్రీలీల జంట‌గా న‌టించిన మూవీ రాబిన్ హుడ్‌. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రం మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.