Aditya 999: నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. దసరాకి ఆదిత్య 999 షురూ?
ఆదిత్య 369.. ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికీ మర్చిపోలేని(Aditya 999) సినిమా.

Balakrishna Aditya 999 movie to start from Dussehra
Aditya 999: ఆదిత్య 369.. ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికీ మర్చిపోలేని సినిమా. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ స్కైఫై మూవీ 1991లో విడుదలై భారీ విజయాన్ని సాధించింది. దర్శకుడు సింగీతం శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మాస్టర్ పీస్ లో రెండు పాత్రల్లో బాలకృష్ణ నటన అద్భుతం అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలుగా ఆయన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది అనడంలో(Aditya 999) ఎలాంటి సందేహం లేదు. టై మిషన్ కాన్సెప్ట్ తో కాలంలో ప్రయాణం చేసి వెనక్కి వెళ్లడం అనేది కాన్సెప్ట్ ఆడియన్స్ ను వివరీతంగా ఆకట్టుకుంది.
అయితే, ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలని బాలకృష్ణ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టుకి సంబందించిన కథ కూడా ఇప్పటికే సిద్ధంగా ఉందని ఆయనే చాలాసార్లు చెప్పుకొచ్చారు. కానీ, సరైన సమయం కోసం ఇంతకాలం ఎదురుచూశారు. ఇప్పుడు ఆ అద్భుతాన్ని ఆవిష్కరించే సమయం ఆసన్నం అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినపడుతున్న టాక్ మేరకు ఆదిత్య 999 సినిమాను దసరా కానుకగా మొదలువుపెట్టాలని భావిస్తున్నాడట బాలకృష్ణ. దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుందని టాక్. ఇక్కడ మరో విశేషం ఏంటంటే? ఈ సినిమాలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ఇది గనక నిజమైతే నందమూరి ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.
మరి భారీ బడ్జెట్ తో అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ విషయంపై మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుతో అఖండ 2: తాండవం సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే అధికారికంగా ఈ సినిమా విడుదలపై ప్రకటన రానుంది.