Balakrishna Aha Unstoppable Allu Arjun Episode Part 2 Glimpse Released
Allu Arjun – Balakrishna : అల్లు అర్జున్ ఇటీవల బాలకృష్ణ ఆహా షో అన్‌స్టాపబుల్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ ని నిన్నే ఆహా ఓటీటీలో రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ట్రెండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఇక అల్లు అర్జున్ తల్లి నిర్మల, అతని బెస్ట్ ఫ్రెండ్ సందీప్ కూడా బాలయ్య షోకి వచ్చారు. అయితే ఈ ఇంటర్వ్యూకు పార్ట్ 2 కూడా ఉందని గతంలోనే ప్రకటించారు.
Also Read : Mahavatar Narsimha : ‘నరసింహుడి’పై సినిమా.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్..
తాజాగా అల్లు అర్జున్ – బాలయ్య అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ వచ్చి అల్లరి చేసారు. అల్లు అయాన్ తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్ మేనరిజం చూపించాడు. బన్నీ పిల్లలతో బాలయ్య సరదాగా గడిపినట్టు తెలుస్తుంది. అలాగే పుష్ప 2 సినిమా గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ ట్రెండ్ అవుతుంది. మీరు కూడా ఈ గ్లింప్స్ చూసేయండి..
అల్లు అర్జున్ పిల్లలు కూడా రావడంతో ఈ ఎపిసోడ్ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప టీమ్ కూడా వచ్చిందని సమాచారం. వచ్చే వారం బాలయ్య – అల్లు అర్జున్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రానుంది.