Mahavatar Narsimha : ‘నరసింహుడి’పై సినిమా.. భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్..
తాజాగా నేడు మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

Mahavatar Narsimha Motion Poster Released
Mahavatar Narsimha : ఇటీవల మైథలాజికల్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మన పురాణాల్లోనివి పాత్రలు, కథలు తీసుకొని వాటిని ఇప్పటి కాలానికి లింక్ ఇస్తూ సరికొత్త కథలు తెస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా నరసింహుడిపై సినిమా రానుంది. హోంబలె నిర్మాణ సంస్థలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో మహావతార్ నరసింహ అనే సినిమా రాబోతుంది.
తాజాగా నేడు మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో భయంకరమైన నరాంసింహ స్వామి అవతారాన్ని చూపించారు. మరి ఇది నరసింహ అవతారం కథలా చూపిస్తారా, ప్రస్తుత కథకు లింక్ చేస్తూ చూపిస్తారా చూడాలి. ఇక ఈ సినిమాని పాన ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. 3D లో కూడా ఈ సినిమా రానుంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి వస్తుందని ప్రకటించారు.
మీరు కూడా మహావతార్ నరసింహ మోషన్ పోస్టర్ వీడియో చూసేయండి..