Thaman : తమన్ బర్త్ డే.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. గేమ్ ఛేంజర్, ఓజి, అఖండ 2, పుష్ప 2 అప్డేట్స్ ఇచ్చిన తమన్..

నేడు తమన్ పుట్టిన రోజు కావడంతో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Thaman : తమన్ బర్త్ డే.. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. గేమ్ ఛేంజర్, ఓజి, అఖండ 2, పుష్ప 2 అప్డేట్స్ ఇచ్చిన తమన్..

Music Director Thaman Birthday Special Interview gives all his Movie Updates

Updated On : November 16, 2024 / 4:00 PM IST

Thaman : డ్రమ్స్ వాయించే స్థాయి నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు తమన్. ఇప్పుడు తెలుగులో ఏ స్టార్ హీరో సినిమా తీసుకున్నా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. ఓ పక్క క్లాస్ లవ్ సాంగ్స్ ఇస్తూనే దద్దరిల్లిపోయే మాస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తమన్ చేతిలో ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్.. లాంటి పెద్ద సినిమాలన్నీ ఉన్నాయి. నేడు తమన్ పుట్టిన రోజు కావడంతో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

తమన్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టుల గురించి అప్డేట్స్ ఇస్తూ.. ఇప్పుడు రకరకాల కథలతో సినిమాలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్.. ఇలా ప్రతి సినిమా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. గేమ్ చేంజర్‌లో ఏడు పాటలుంటాయి. శంకర్ గారు చాలా ఏళ్ల తరువాత ఓ ప్రాపర్ కమర్షియల్ సినిమా చేస్తున్నారు. గేమ్ చేంజర్ నుంచి నెక్ట్స్ 20వ తేదీన ఒక డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేస్తాం. ఆ తరువాత అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి ఒక పాటను రిలీజ్ చేస్తాం. ఆ పాట ఇంగ్లీష్ వర్షెన్ కూడా ఉంటుంది. శంకర్ గారు గేమ్ చేంజర్‌లో ముందు ఆరు పాటల్ని షూట్ చేశారు. ఆ తరువాతే సీన్లను షూట్ చేశారు. బన్నీ- త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని కూడా చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నారు. పుష్ప 2 కి కూడా పనిచేసాను. నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను. రాజా సాబ్‌లో ఆరు పాటలుంటయి. ఓ రీమేక్ సాంగ్ కూడా ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఉన్నట్టే సాంగ్స్ ఉంటాయి. జనవరి నుంచి పాటల అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నాం. తెలుసు కదా సినిమాలో ఆరు పాటలు అద్భుతంగా ఉంటాయి. సిద్దుకి మంచి కారెక్టర్ దొరికింది. సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పుణెలో షూటింగ్ జరుగుతోంది. తొలిప్రేమ తరువాత నాకు మంచి లవ్ స్టోరీ అవుతుంది. మళ్లీ రెండు లవ్ స్టోరీలను ఒప్పుకున్నాను. అఖండ 2 పనులు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక పాట అయిపోయింది అని తెలిపారు.

Also Read : Akira Nandan – Thaman : పవన్ OG సినిమాకు కొడుకు అకీరా మ్యూజిక్.. లీక్ చేసిన తమన్..!

తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ.. సినిమాలో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వేస్ట్. అఖండకు ఇచ్చినట్టుగా భగవంత్ కేసరికి ఇవ్వలేను. బీజీఎం అనే దానికి మణి గారి తరువాత ట్రెండ్‌ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. కొన్ని సినిమాలకు వాయిస్ ఎక్కువ వినిపించాలి.. ఇంకొన్ని సినిమాలకు పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి. అఖండకు చేసే టైంలో శివుడే నాలోకి వచ్చి చేయించినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ ఆ రేంజ్ బీజీఎం ఇస్తానో లేదో నాకు తెలీదు అని అన్నారు.

ఇక మ్యూజిక్‌లో.. ఏ ఆర్ రెహమాన్ స్థాయికి వెళ్లాలి అనేది నా కల. బాయ్స్ టైంలో శంకర్ గారు నాలో యాక్టర్‌ని చూశారు. ఇప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ అని గుర్తించి గేమ్ ఛేంజర్ ఇచ్చారు అని అన్నారు.

తనపై వచ్చే విమర్శలకు స్పందిస్తూ.. ఒకప్పుడు మూసధోరణిలో ఉన్న సినిమాలకు వరుసగా మ్యూజిక్ ఇవ్వడంతో కాపీ క్యాట్ అని ట్రోల్ చేశారు. ఇప్పుడు అలాంటి రొటీన్ సినిమాలను సెలెక్ట్ చేసుకోవడం లేదు. తెలివైన వాళ్లు చాలా జాగ్రత్తగా కాపీ కొడతారు. ఎక్కడి నుంచి కొట్టారో కనిపెట్టలేం. కానీ నాకు అంత తెలివి లేదు. కాపీ కొట్టడం రాదు. అందుకే వెంటనే దొరికిపోతాను అని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఓజీ గురించి నేను ఏం మాట్లాడినా డిప్యూటీ సీఎం గారి దగ్గరకు వెళ్తుంది. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన వరదల ప్రభావంతో అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయొద్దని అన్నారు. జనవరి నుంచి అప్డేట్లు ఇస్తాం. దాదాపు 80 శాతం షూటింగ్ అయిపోయింది. ఇంత వరకు ఇండియాలో రానటువంటి ఓపెనింగ్స్ ఓజీకి వస్తాయి. ఆయన్ను మీట్ అయ్యేందుకే కష్టపడుతున్నాం. ఇంకా పాటలు పాడించడం కష్టమే. ఓజీలో రమణ గోగుల గారితో ఓ పాట పాడించాలని ట్రై చేస్తున్నాను. అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. ఓజీ కోసం అకిరాను పిలుస్తాను. గతంలో రెండు నెలలు నాతో అకిరా పని చేశాడు అని అన్నారు.

Thaman

ఇక తన పర్సనల్ విషయాల గురించి చెప్తూ.. నా భార్యే నా అకౌంట్, మ్యూజిక్ వ్యవహారాలన్నీ చూస్తారు. నాకు ఏమైనా అవసరాలు పడితే డబ్బులు అడుగుతాను. ఆమె ఇస్తారు. నా కొడుకు ఐఐటీ ఫస్ట్ ఇయర్. నా ఫ్యామిలీ కూడా నెమ్మదిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతోంది. నా కొడుకు వాయించే తీరు చూసి వాడు ఏ ఎమోషన్స్‌లో ఉన్నాడో చెబుతాను. నా కొడుక్కి నేను సలహాలు ఇవ్వను అని తెలిపాడు.

ఇక తమన్ తన జీవిత ఆశయం గురించి చెప్తూ.. మ్యూజికల్ స్కూల్ కట్టాలని నా కోరిక. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగను అని అన్నారు. ఇక తమన్ కు ఫ్యాన్స్, పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.