Akira Nandan – Thaman : పవన్ OG సినిమాకు కొడుకు అకీరా మ్యూజిక్.. లీక్ చేసిన తమన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(OG) ఒకటి.

Thaman comments on Akira Nandan viral
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓజీ’(OG) ఒకటి. సుజిత్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయిక. శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓజీ కోసం అకిరాను పిలుస్తాను అని అన్నాడు.
ఓజీ మూవీలో రమణ గోగులతో ఓ పాట పాడించాలని చూస్తున్నాన్నట్లు తమన్ తెలిపారు. ఓజీ కోసం అకిరా నందన్‌ను పిలుస్తానని తమన్ చెప్పాడు. గతంలో రెండు నెలలు అకిరా తనతో పని చేసినట్లు వెల్లడించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ సంతోష పడుతున్నారు.
Nara Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి మృతి..
ఇక పవన్ కుమారుడు అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు అన్న సంగతి తెలిసిందే. తమన్ చెప్పిన మాటలను బట్టి అకిరా ఓజీ సినిమాకు సంగీతం అందివ్వనున్నాడని అంటున్నారు. కాగా.. అకిరా ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే.. ఓజీ మూవీలో అకిరా నటిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. మరి అకిరా తన తండ్రి మూవీలో నటిస్తున్నాడా? లేదంటే సంగీతాన్ని అందిస్తున్నాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనప్పటికి ఓజీ సినిమాలో అకిరా భాగం కానున్నాడని తెలిసి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Nayanthara – Dhanush : ధనుష్ వర్సెస్ నయనతార.. ధనుష్ పై విమర్శలు చేస్తూ నయనతార ఫైర్.. ఇంత ఓపెన్ గా లెటర్ రాసి..