Unstoppable With NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది.. రేపే అనౌన్స్.. ప్రోమో కూడా..?

ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే.

Unstoppable With NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ 4 రాబోతుంది.. రేపే అనౌన్స్.. ప్రోమో కూడా..?

Balakrishna Aha Unstoppable With NBK Show Season 4 Streaming Soon Details Here

Updated On : October 10, 2024 / 8:18 PM IST

Unstoppable With NBK : మన తెలుగు ఓటీటీ ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్‌స్టాపబుల్ టాక్ షో ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అన్‌స్టాపబుల్ సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 మూడు మంచి సక్సెస్ అయ్యాయి. అసలు బాలయ్యని యాంకర్ గా ఊహించుకోని ప్రేక్షకులకు సరికొత్తగా కనపడి షాక్ ఇవ్వడమే కాకుండా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, నాని.. ఇలా చాలామంది స్టార్ హీరోలను, పలువురు హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రాజకీయ నాయకులను తీసుకొచ్చి సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు బాలయ్య బాబు.

ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ షో అనేక రికార్డులు బద్దలుకొట్టింది. దేశ వ్యాప్తంగా ఈ షోకి మంచి పేరు రావడమే కాక బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, తెలుగు ప్రేక్షకులకు మంచి ఊపు తీసుకొచ్చింది. ఇంత సూపర్ హిట్ అయిన అన్‌స్టాపబుల్ షోని మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు. త్వరలోనే అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Also Read : Sudheer Babu : నాన్న సినిమాకు తనయుడి డబ్బింగ్..? కొడుకుతో కలిసి డబ్బింగ్ స్టూడియోలో సుధీర్ బాబు..

రేపు దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 4ని ప్రకటించబోతున్నట్టు, దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఆల్రెడీ కొన్ని ఎపిసోడ్స్ కూడా షూట్ అయినట్టు తెలుస్తుంది. ఈసారి నాగార్జున కూడా ఈ షోకి వచ్చి సందడి చేయబోతున్నారట. అలాగే ఎప్పట్నుంచో చిరంజీవిని ఈ షోకి తీసుకు వస్తారని అంటున్నారు మరి ఈసారైనా వచ్చి మెగా – నందమూరు ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారేమో చూడాలి.