Balakrishna and gopichand malineni film started with pooja ceremony
NBK 111 : నందమూరి బాలకృష్ణ వరుస చిత్రాల్లో నటిస్తూ పుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే బాలయ్య మరో చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ‘#NBK111’గా ఇది ప్రచారంలో ఉంది. నేడు (నవంబర్ 26న) పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైనట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఓ పవర్ పుల్ పోస్టర్‌ను పంచుకుంది.
Varanasi : వారణాసిలో మహేశ్ బాబు మేనల్లుడు!
The battlefield rises to salute its MIGHTIEST KING 🔥#NBK111 Muhurtham Today 🦁
This HISTORICAL ROAR is set to shake the very foundations of history and script a new chapter 💥
GOD OF MASSES #NandamuriBalaKrishna #Nayanthara @megopichand @Venkataskilaru @vriddhicinemas… pic.twitter.com/yslTXW3DL6
— NBK 111 (@NBK111Movie) November 26, 2025
అందులో బాలయ్య రెండు లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఒకటి యోధుడిగా కనిపిస్తుండగా మరొక లుక్‌లో మెడలో రుద్రాక్షమాలతో పవర్‌పుల్‌గా ఉన్నారు. అంటే ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Sampath Nandi : టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట తీవ్ర విషాదం
ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయిక కాగా తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బాలయ్య, దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన వీర సింహారెడ్డి చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.