Balakrishna Bhagavanth Kesari second single update
Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal), శ్రీలీల (Sreeleela) ఈ మూవీలో ముఖ్య పాత్రలు చేస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఈ నెల అక్టోబర్ లో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఇప్పటికే మొదటి సాంగ్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. ఇటీవల జర్నీ వీడియోని రిలీజ్ చేశారు.
Naa Saami Ranga : నాగార్జున సినిమా కోసం ఆ ఇద్దరు ముద్దగుమ్మలు.. నా సామిరంగ..!
తాజాగా సెకండ్ సింగల్ అప్డేట్ ని ఇచ్చారు. ‘ఉయ్యాలో ఉయ్యాలా’ అనే సాగే సాంగ్ ని అక్టోబర్ 4న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ పాట బాలకృష్ణ అండ్ శ్రీలీల చిన్నప్పటి పాత్ర మధ్య సాగనుంది. మొదటి పాటలో కలిసి చిందులేసిన బాలయ్య అండ్ శ్రీలీల.. సెకండ్ సాంగ్ తో ఎమోషనల్ చేయబోతున్నారు. కాగా ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.
Salaar : సలార్ ఆ మూవీకి రీమేక్.. కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్..
This one perfectly depicts the bond between #BhagavanthKesari & Vijji Papa ?
Lyrical Video on October 4th ❤️
In Cinemas from October 19th?#NandamuriBalakrishna @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @Shine_Screens @JungleeMusicSTH pic.twitter.com/Fu7K8Nmhbg
— Anil Ravipudi (@AnilRavipudi) October 1, 2023
సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అభిమానుల్లో కొంత సందేహం నెలకుంది. ప్రస్తుతం బాలయ్య ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నాడు. దీంతో ఈ ఈవెంట్ ని మూవీ టీం నిర్వహిస్తారా..? ఒకవేళ ఏర్పాటు చేసినా.. బాలకృష్ణ వస్తాడా..? అనే డౌట్స్ అందరిలో ఉన్నాయి. మరి అభిమానుల సందేహాలకు మూవీ టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.