Balakrishna Boyapati Sreenu Akhanda 2 Title Theme Video Released Thaman BGM Goosebumps
Akhanda 2 : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబోలో సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు హ్యాట్రిక్ తర్వాత ఇప్పుడు నాలుగో సినిమాగా అఖండ 2 రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. నేడు అఖండ 2 మూవీ ప్రకటించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. అలాగే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది.
తాజాగా అఖండ 2 టైటిల్ థీమ్ కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేసారు. ఈ టైటిల్ థీమ్ కి తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ ఇచ్చాడు. టైటిల్ కే ఈ రేంజ్ లో ఇచ్చాడు అంటే అఖండ 2 సినిమాకి ఏ రేంజ్ లో ఇస్తాడో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు. అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే BGM ఇచ్చి థియేటర్స్ లో దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. అఖండ 2 టైటిల్ కి తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు. దానికి తగ్గట్టు తమన్ తాండవం చూపించేలా ఉన్నాడు. మీరు కూడా అఖండ 2 టైటిల్ థీమ్ వినేయండి..
ఇక ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. బాలయ్య బాబుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడం విశేషం.