Balakrishna comments : అమ‌రావ‌తిలో కూడా బాల‌య్య బాబు సేవ‌లు.. అఖండ 2 పై కామెంట్స్‌.

ఎన్టీఆర్ కుమారుడుగా పుట్టడం త‌న‌ అదృష్టం అని నంద‌మూరి బాల‌కృష్ణ చెప్పారు (Balakrishna comments). ఆయ‌న ఒక ఆదర్శ పురుషుడు అని అన్నారు.

Balakrishna comments after lays foundation stone for basavatarakam cancer hospital in Amaravati

Balakrishna comments : అమ‌రావ‌తిలో అత్యాధునిక క్యాన్స‌ర్ కేర్ క్యాంప‌స్‌ను హైద‌రాబాద్‌లోని బ‌స‌వ‌తార‌కం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయ‌నుంది. ఇందుకు సంబంధిన భూమి పూజ‌ను బుధ‌వారం తుళ్లూరు స‌మీపంలో సంస్థ ఛైర్మ‌న్, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ మాట్లాడుతూ(Balakrishna comments).. రోగుల‌కు అందిస్తున్న సేవ‌ల‌కు గుర్తింపుగా బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రికి ఎన్నో అవార్డులు వ‌చ్చాయ‌న్నారు. అత్యుత్త‌మ క్యాన్స‌ర్ ఆస్ప‌త్రిగా దేశంలో మంచి పేరు తెచ్చుకుంద‌న్నారు. క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి లాభాపేక్ష కోసం కాద‌ని, దాత‌ల స‌హ‌కారంతో న‌డుస్తోంద‌న్నారు.

Rajasaab : రాజాసాబ్ వివాదంపై స్పందించిన నిర్మాణ సంస్థ.. ఇష్యూ క్లోజ్ అయినట్టేనా?

అది నా అదృష్టం..

‘ఎన్టీఆర్ కుమారుడుగా పుట్టడం నా అదృష్టం. ఆయ‌న ఒక ఆదర్శ పురుషుడు. నటనకు ఆయ‌న‌ ఒక అలంకారం. ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. మరణం లేని చిరస్మరణీయుడు. ఆయన లాంటి జీవితం ఎవరికి రాదు. ప్రపంచంలోనే గొప్ప నటుడు. ప్రతి తెలుగు బిడ్డలకు ఒక ధైర్యం. బడుగు బలహీన వర్గాల ప్రజలుకు రాజకీయంగా పైకి తెచ్చిన వారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన నాయకుడు.’ అని బాల‌కృష్ణ తెలిపారు.

Rajinikanth : అప్పుడు కొడుకుగా నటించి.. ఇప్పుడు రజినీకాంత్ తోనే వార్ కి సిద్దమైన హీరో..

రాజ‌ధానికి భూములు ఇచ్చిన అమ‌రావ‌తి రైతుల‌కు త‌ల‌వంచి న‌మ‌స్కారం చేస్తున్న‌ట్లు చెప్పారు. త‌న‌ను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించార‌న్నారు. తాను చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి అయ్యాయ‌ని, త‌న‌ను ఆదరించిన వారికి అందిరికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ‘నా అభిమానులకు కృతజ్ఞతలు. నేను ఈ సమాజంలో ఒక కర్షకుడిని. ఇప్పటికే నా నాలుగు సినిమాలు వరుస హిట్లు. అఖండ -2 కూడా భారీ విజయం సాధిస్తుంది. బాలకృష్ణ అంటే అటూ రాజకీయం..ఇటు సినిమా రంగం అయినా ఒకటే’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

అఖండ 2 వాయిదా ప‌డుతుందా?
బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య న‌టిస్తున్న చిత్రం ‘అఖండ 2’. ఈ చిత్రంలో సంయుక్త హీరోయిన్‌గా న‌టిస్తోంది. 14 రీల్స్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా నందమూరి తేజస్విని స‌మ‌ర్పిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

అయితే.. తాజాగా ఈ చిత్ర విడుద‌ల వాయిదా ప‌డుతుంద‌నే వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, సీజీ వ‌ర్క్స్‌కు స‌మ‌యం ప‌డుతుంద‌ని, అందుక‌నే వాయిదా వేయాల‌ని చిత్ర బృందం ఆలోచిస్తున్న‌ట్లు స‌ద‌రు వార్త‌ల సారాంశం. అయితే.. సినిమా వాయిదా పై చిత్ర బృందం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.