Daaku Maharaaj Collections : డాకు మహారాజ్ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా? బాలయ్య కెరీర్ హైయెస్ట్..

డాకు మహారాజ్ బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది.

Balakrishna Daaku Maharaaj Movie First Day Collections

Daaku Maharaaj Collections : బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా నిన్న జనవరి 12 థియేటర్స్ లో రిలీజయి దూసుకుపోతుంది. బాలయ్య ఫ్యాన్స్ కి కావాల్సిన యాక్షన్ తో పాటు ఎమోషన్ సీన్స్, మంచి మెసేజ్ కూడా ఉండటంతో ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. సినిమాపై ముందు నుంచి అంచనాలు ఉండటం, సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో డాకు మహారాజ్ సినిమాకు బాగా కలిసొస్తుంది.

Also Read : Mazaka Teaser : సందీప్ కిషన్ ‘మజాకా’ టీజర్ వచ్చేసింది.. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడితే..

డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య వీరసింహ రెడ్డి సినిమా మొదటి రోజు 54 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డ్ డాకు మహారాజ్ బ్రేక్ చేసి బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ గా నిలిచింది.

డాకు మహారాజ్ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లు జరిగింది. అంటే గ్రాస్ ఆల్మోస్ట్ 160 కోట్ల పైన కలెక్ట్ చేయాలి. మొదటి రోజే 50 కోట్లు రావడంతో సంక్రాంతి హాలిడేస్ అయ్యేలోపే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయి ప్రాఫిట్స్ లోకి వచ్చేస్తుందని భావిస్తున్నారు. దీంతో అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ తర్వాత ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాతో మరో హిట్ కొట్టారు బాలయ్య.