Mazaka Teaser : సందీప్ కిషన్ ‘మజాకా’ టీజర్ వచ్చేసింది.. తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడితే..
మీరు కూడా మజాకా టీజర్ చూసేయండి..

Sundeep Kishan Ritu Varma Mazaka Teaser Released
Mazaka Teaser : హీరో సందీప్ కిషన్ ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో హిట్ కొట్టాడు. వెంటనే ధనుష్ రాయన్ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆ సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు. త్వరలో ‘మజాకా’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మాణంలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మజాకా సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి స్టార్ రైటర్ ప్రసన్న బెజవాడ కథ, మాటలు అందిస్తున్నారు.
ప్రస్తుతం మజాకా సినిమా షూట్ జరుగుతుంది. ఈ సినిమాతో మన్మధుడు హీరోయిన్ అన్షు అంబానీ రీ ఎంట్రీ ఇస్తుంది. అలాగే రీతూ వర్మ కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొద్దాం అనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా అవ్వకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటివరకు మజాకా సినిమా నుంచి కేవలం పోస్టర్స్ రిలీజ్ అవ్వగా తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. మీరు కూడా మజాకా టీజర్ చూసేయండి..
ఇక టీజర్ చూస్తుంటే.. సందీప్ కిషన్, రావు రమేష్ ఇద్దరు తండ్రి కొడుకులుగా నటిస్తున్నారు. సందీప్ కిషన్ రీతూ వర్మ పాత్రతో ప్రేమలో పడితే, రావు రమేష్ అన్షు అంబానీ పాత్రతో ప్రేమలో పడినట్టు, తండ్రి కొడుకులు ఇద్దరూ ప్రేమలో పడినట్టు, పెళ్లి సమయంలో ఏదో ఇబ్బంది వచ్చినట్టు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా చూపించారు. ఇది సందీప్ కిషన్ కి 30వ సినిమా. టీజర్ చూస్తుంటేనే సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. ఈ సినిమాతో కూడా హిట్ కొట్టి సందీప్ తన హిట్ ఫ్లో కొనసాగిస్తాడేమో చూడాలి.
Also Read : Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. భారీగా.. నిర్మాత వ్యాఖ్యలు..