Daaku Maharaaj : బాలయ్య ‘డాకు మహారాజ్’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ అక్కడే.. భారీగా.. నిర్మాత వ్యాఖ్యలు..
డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Balakrishna Daaku Maharaaj Grand Success Event Details Here Said by Producer Nagavamsi
Daaku Maharaaj : వరుసగా మూడు హిట్స్ తర్వాత బాలకృష్ణ నేడు డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. బాలయ్య కొత్తగా కనిపించాడని, మాస్ యాక్షన్ సీన్స్ అదిరిపోయాయి అను, సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయని, ఇక థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదిరిపోయిందని అంటున్నారు ప్రేక్షకులు, అభిమానులు.
Also Read : Akkineni Family : ‘అక్కినేని కజిన్స్’ ఫోటో వైరల్.. అక్కినేని ఇంట సంక్రాంతి మొదలు.. కొత్త జంట కూడా ఉందిగా..
డాకు మహారాజ్ పాజిటివ్ టాక్ వస్తుండటంతో మూవీ యూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో పెట్టాలనుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. అక్కడ భారీగా ఏర్పాట్లు చేసాము. ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురుచూసారు. కానీ అనుకోకుండా అలా జరిగింది. అందుకే ఈ వారంలో డాకు మహారాజ్ సక్సెస్ మీట్ అనంతపురంలో గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది మాస్ సినిమానే కాదు. అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమా. ఫ్యామిలీలతో కలిసి వెళ్లొచ్చు అని తెలిపారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఈ సక్సెస్ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ.. రెండేళ్ళ క్రితం ఒక ఆలోచనతో ప్రయాణం మొదలుపెట్టి ఈ సంక్రాంతికి మీ ముందుకు వచ్చింది. బాలకృష్ణ గారి కెరీర్ లో గొప్ప సినిమాల్లో ‘డాకు మహారాజ్’ నిలుస్తుందని గతంలోనే నాగవంశీ అన్నారు. వంశీ గారి నమ్మకం నిజమై ఇప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో విజయాన్ని అందుకున్నాను. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ తో విజయం అందుకున్నాను. తమన్, విజయ్ కార్తీక్, వెంకట్.. టీమ్ అంతా కష్టపడటం వల్లే మంచి అవుట్ ఫుట్ వచ్చింది. థియేటర్ లో సినిమా చూస్తూ ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాకి వస్తున్న స్పందన చూసి బాలకృష్ణ గారు చాలా హ్యాపీగా ఉన్నారు అని అన్నారు.
Also Read : Director Shankar : అతను మరణించిన తర్వాతే ‘శంకర్’ సినిమాల ఫలితాలు ఇలా..? సుజాత లేని లోటు తెలుస్తుంది..
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడుతూ.. నా పుట్టినరోజు నాడు రిలీజయిన డాకు మహారాజ్ సినిమా హిట్ అవ్వడం ఆనందంగా ఉంది అని తెలిపింది. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి మాకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రేక్షకులతో కలిసి ఈ సినిమా చూశాము. ఇప్పటి వరకు నేను ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చూడలేదు. ముఖ్యంగా బాలయ్య బాబు గారి అభిమానులకు చాలా థ్యాంక్యూ అని అన్నారు.