Akkineni Family : ‘అక్కినేని కజిన్స్’ ఫోటో వైరల్.. అక్కినేని ఇంట సంక్రాంతి మొదలు.. కొత్త జంట కూడా ఉందిగా..
హీరో సుశాంత్ అక్కినేని కజిన్స్ తో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Akkineni Cousins Photo Shared by Sushanth Naga Chaitanya Sobhita Highlighted
Akkineni Family : మన స్టార్స్ ఫ్యామిలీలు అప్పుడప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసి ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. ముఖ్యంగా పండగల సమయంలో సెలబ్రిటీల ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకేచోట చేరి సెలెబ్రేట్ చేసుకుంటారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీ సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. అక్కినేని ఫ్యామిలీ కజిన్స్ ఉన్న ఫోటో వైరల్ గా మారింది.
Also Read : Anshu Ambani : 22 ఏళ్ళ క్రితం ‘మన్మధుడు’ హీరోయిన్.. ఇప్పుడు సందీప్ కిషన్ పక్కన హీరోయిన్ గా..
హీరో సుశాంత్ అక్కినేని కజిన్స్ తో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఈ ఫొటోలో సుశాంత్, సుప్రియ, సుమంత్ తో పాటు కొత్త జంట నాగచైతన్య, శోభిత కూడా ఉన్నారు. అలాగే మరికొంతమంది అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. దీంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. అందరూ కలిసి సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలుపెట్టారేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
నాగచైతన్య – శోభిత పెళ్లి తర్వాత వస్తున్న మొదటి సంక్రాంతి కావడంతో ఈసారి గ్రాండ్ గానే సెలెబ్రేట్ చేసుకుంటారు, మరిన్ని ఫోటోలు వస్తాయని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ గా సంక్రాతికి చిరంజీవి ఫ్యామిలీ ఫోటోలు వస్తాయి. ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఫొటోలేమి రాలేదు. అక్కినేని కజిన్స్ ఫోటో రావడంతో మెగా ఫ్యాన్స్ కూడా మెగా ఫ్యామిలీ పండగ సెలబ్రేషన్స్ ఫోటోల కోసం ఎదురుచూస్తున్నారు.
Also Read : Director Shankar : అతను మరణించిన తర్వాతే ‘శంకర్’ సినిమాల ఫలితాలు ఇలా..? సుజాత లేని లోటు తెలుస్తుంది..