Daaku Maharaaj : బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ ట్విట్టర్ రివ్యూ..

ఫ్యాన్స్, నెటిజన్లు సినిమా ఎలా ఉందో తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Balakrishna Daaku Maharaaj Movie Twitter Review

Daaku Maharaaj Twitter Review : డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా ‘డాకు మహారాజ్’. నేడు జనవరి 12న ఈ సినిమా రిలీజయింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా, బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Sukumar : వాట్.. సుకుమార్ ఆ హీరోకు వీరాభిమానా? ఎవ్వరూ ఊహించి ఉండరు..

ఇప్పటికే ఏపీలో మార్నింగ్ షోలు, బెనిఫిట్ షోలు పడ్డాయి. ఓవర్సీస్ లో కూడా షోలు పడ్డాయి. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు సినిమా ఎలా ఉందో తమ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.