Balakrishna First Interaction with Media After Announcing Padma Bhushan Award
Balakrishna : నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. నటుడిగా ఇటీవలే 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, ఇటీవల ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సాధించడం, వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవ్వడం.. ఇలాంటి సమయంలో బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటిచడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నిన్నటి నుంచి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు బాలయ్య బాబుకు అభినందనలు తెలియచేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పలువురు ప్రముఖులు నేరుగా బాలయ్య ఇంటికి వెళ్లి అభినందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాలయ్య ఇంటికి వెళ్లి అభినందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, బాలయ్య మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు.
Also Read : Nara Bhuvaneswari : మా పుట్టింటికి రెండో పద్మం.. బాల అన్నయ్య అంటూ నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్..
కిషన్ రెడ్డి మాట్లాడిన అనంతరం బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు రావడంపై మొదటి సారి మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడానికి నా వెనక ఎంతో మంది ఉన్నారు. వాళ్ళే నా బలం, నా బలగం. నటనలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో నాకు ఈ అవార్డు ప్రకటించినందుకు కృతజ్ఞతలు. ఓ వైపు ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచాను, క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నాను. ఇలాంటివి మరిన్ని చేయడానికి ప్రోత్సహిస్తూ నాకు ఈ అవార్డుని ప్రకటించారు. మా నాన్నగారే నాకు దైవం, గురువు. ఆయన బాటలోనే నేను నడుస్తున్నాను. నాకు అభినందనలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ సందర్భంగా నాన్న గారికి కూడా భారతరత్న ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అది అభిమానులు, తెలుగు వారి కోరిక అని అన్నారు.
Also Read : Manchu Vishnu : మంచు విష్ణు మంచి మనుసు.. వారి కోసం 50% స్కాలర్‌షిప్.. ఎవరెవరికి? డీటెయిల్స్ ఇవే..
అయితే మీకు అవార్డు లేట్ గా వచ్చిందని ఫీల్ అవుతున్నారా అని ఓ మీడియా ప్రతినిధి అడగడంతో బాలకృష్ణ స్పందిస్తూ.. నేను అలా ఏమి అనుకోవట్లేదు. ఇటీవలే 50 ఏళ్ళు పూర్తయింది ఫిలిం ఇండస్ట్రీలో. మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యాను. నాలుగు సినిమాలు వరుస విజయం సాధించాయి. క్యాన్సర్ హాస్పిటల్ త్వరలో 18 ఏళ్ళు పూర్తిచేసుకోబోతుంది. ఇలాంటి కరెక్ట్ టైంలోనే అవార్డు వచ్చింది. ఫ్యాన్స్ అడుగుతారు కానీ నాకు రావాల్సిన టైంకి అవార్డు వచ్చింది అని అన్నారు. ఇక బాలయ్య ఇటీవల సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు.