Balakrishna : అమెరికాలో హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. వరుసగా మూడో సినిమాతో ఆ రికార్డ్..

ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించగా ఈ సినిమాతో కూడా అది సాధించి 100 కోట్ల హ్యాట్రిక్ బాలయ్య కొడతారని భావిస్తున్నారు. అయితే దానికంటే ముందే అమెరికాలో హ్యాట్రిక్ కొట్టేసాడు బాలయ్య బాబు.

Balakrishna Hat trick Success in America with Bhagavanth Kesari Movie

Balakrishna :  బాలకృష్ణ (Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. బాల‌య్య‌కు జోడిగా కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal) నటించగా శ్రీలీల(Sreeleela) బాలయ్య బాబుకి కూతురి పాత్ర‌లో నటించి మెప్పించింది.

బాలయ్య నుంచి వచ్చే రెగ్యులర్ యాక్షన్ మూవీ, అనిల్ రావిపూడి నుంచి వచ్చే రెగ్యులర్ కామెడీ కమర్షియల్ మూవీ కాకుండా బిన్నంగా ఎమోషన్స్, మెసేజ్ లతో భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకులని మెప్పించింది. దీంతో మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని భగవంత్ కేసరి సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లోనే 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. దసరా పండుగ ఉండటంతో ఈసారి కూడా 100 కోట్లు దాటిస్తాడని అంచనా వేస్తున్నారు అభిమానులు.

Also Read : Nani 31 : ‘సరిపోదా శనివారం’ అంటున్న నాని.. నాని 31 సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్..

ఇటీవల అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్ల విజయాలు సాధించగా ఈ సినిమాతో కూడా అది సాధించి 100 కోట్ల హ్యాట్రిక్ బాలయ్య కొడతారని భావిస్తున్నారు. అయితే దానికంటే ముందే అమెరికాలో హ్యాట్రిక్ కొట్టేసాడు బాలయ్య బాబు. బాలయ్య అఖండ, వీరసింహారెడ్డి సినిమాలు అమెరికాలో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేశాయి. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా కూడా మూడు రోజుల్లోనే 1 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసి 2 మిలియన్స్ కి దూసుకుపోతుంది. దీంతో వరుసగా మూడో సినిమాతో బాలయ్య 1 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టి అమెరికాలో హ్యాట్రిక్ కొట్టాడు. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.