Balakrishna – Karan Johar : ఇదెలా మిస్సయ్యాం రా.. బాలయ్యతో కరణ్ జోహార్ ఇంటర్వ్యూ.. హిందీ పాట పాడిన బాలయ్య..

ఐఫా వేడుకల్లో బాలయ్య అవార్డు అందుకున్న తర్వాత కరణ్ జోహార్ తో చిన్న చిట్ చాట్ చేసారు. అక్కడే స్టేజిపై కరణ్, బాలయ్య కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేసారు.

Balakrishna Karan Johar Special Interview in IIFA 2024 Event Video goes Viral

Balakrishna – Karan Johar : ఇటీవల బాలకృష్ణ దుబాయ్ లోని ఐఫా వేడుకల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో బాలయ్య గోల్డెన్ లెగసి అవార్డు అందుకున్నారు. ఆ ఈవెంట్లో బాలయ్య, నాగార్జున, వెంకటేష్ కలిసి ఉన్న ఫొటోలు, బాలయ్య అవార్డు అందుకున్న ఫొటోలు, బాలయ్య ఐశ్వర్య రాయ్ కి అవార్డు అందించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అసలు వీడియో ఒకటి మిస్ అయిపోయింది.

ఐఫా వేడుకల్లో బాలయ్య అవార్డు అందుకున్న తర్వాత కరణ్ జోహార్ తో చిన్న చిట్ చాట్ చేసారు. అక్కడే స్టేజిపై కరణ్, బాలయ్య కూర్చొని ఈ ఇంటర్వ్యూ చేసారు. వెనకాలే హోస్ట్ గా వ్యవహరిస్తున్న తేజ సజ్జ, రానాలు కూడా ఉన్నారు. ఈ చిట్ చాట్ లో కరణ్ సరదా ప్రశ్నలు అడగ్గా బాలయ్య కూడా అలాగే సమాధానాలు ఇచ్చారు.

Pawan Kalyan – Karthi : కార్తీ, తిరుమల లడ్డు వివాదంపై మళ్ళీ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. కార్తీ, సూర్య ఇద్దరూ..

కరణ్.. మీరు మొదటిసారి జై బాలయ్య అని ఎప్పుడు విన్నారు అని అడగ్గా బాలయ్య.. అభిమన్యుడు తెలుసా, ఆయన లాగే తల్లి కడుపులో ఉన్నప్పుడు విన్నాను అని ఆసక్తిగా సమాధానం ఇచ్చారు. కరణ్.. మీ టాక్ షోకి వచ్చిన వరస్ట్ గెస్ట్ ఎవరు అని అడగ్గా బాలయ్య.. నా దగ్గరికి వచ్చే ఇంట్రావర్ట్స్ అంతా నా షోలో అన్ని బయటకు మాట్లాడేస్తారు అని చెప్పారు. కరణ్.. అందరికి మీరంటే ఎందుకు భయం, ఇపుడు నేను కూడా కొంచెం భయపడుతున్నాను ఎందుకు అని అడగ్గా బాలయ్య.. వాళ్లంతా నన్ను ఇష్టపడతారు కానీ కొన్ని సార్లు నన్ను ఇరిటేట్ చేస్తే నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను అందుకే భయపడతారు అని అన్నారు. కరణ్.. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వీళ్ళు ముగ్గురిలో మీ ఫేవరేట్ ఎవరు అని అడిగితే వాళ్ళు ముగ్గురు లెజెండ్స్ అని చెప్పారు బాలయ్య.

చివర్లో ఓ పాట పాడమని అడగ్గా హిందీ సాంగ్ ఒకటి పాడి అలరించారు బాలకృష్ణ. దీంతో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతుంది. బాలకృష్ణతో కరణ్ జోహార్ ఇంటర్వ్యూ అంటే మాములు స్పెషల్ కాదు, అందులో ఇలా స్టేజిపై చేసి, బాలయ్యతో పాట పాడించడం అంటే స్పెషల్ అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. మీరు కూడా ఈ చిన్ని స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి..